పచిసీ అంటే సాహిత్యపరంగా చదరంగ౦ వంటి ఆట అనే అర్ధం ఉంది. ఫతేపూర్ సిక్రీ లో పచిసీ మందిరం దివాన్-ఏ-ఆమ్ కి దగ్గరగా ఉంది. తెలుపు, నలుపు చదరాల కలయికతో నిర్మించినందున ఈ ప్రాంగణంలోని మైదానం అసలైన చదరంగం పలక వలె ఉంటుంది. పురాతన కాల౦లో చక్రవర్తి చదరంగాన్ని పోలిన ఆటను ఇక్కడ ఆడేవాడు, కాని ఒక్క తేడా ఏమిటంటే అతను ఆట కోసం మనుషులను ఉపయోగించేవాడు.
మొఘలుల సామాజిక సంస్కృతి, జీవనవిధానాన్ని బాగా తెలుసుకోవడానికి పర్యాటకులు, చరిత్రకారులు ఈ విశాలమైన ప్రాంగణాన్ని తరచుగా సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications