గోకర్ణ పట్టణం నుండి కుడ్లే బీచ్ రెండు కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ బీచ్ చేరాలంటే పర్యాటకులు గణపతి దేవాలయం వైపునుండి రావాలి. గోకర్ణనుండి రిక్షాలో కూడా బీచ్ చేరవచ్చు. బీచ్ చేరిన పర్యాటకులు అక్కడి తెల్లని ఇసుక, వరుసగా అందంగా నిలబడిన తాటి చెట్లు చూసి అచ్చరువొందుతారు. హోటళ్ళు, చిన్న గుడిసెలు స్ధానిక రుచికర ఆహారాలు అందిస్తాయి.
ఈ ప్రాంతంలో బాగా ఆనందించాలంటే, పర్యాటకులు చిన్న గుడిసె అద్దెకు తీసుకొని కొంత సమయం గడపాలి. రాత్రులలో కుడ్లే బీచ్ నుండి పేరడైజ్ బీచ్ వరకు నడకలో వెళ్ళవచ్చు.



Click it and Unblock the Notifications