హెడ్వి గుహగర్ పట్టణానికి సమీపంలోగల ఒక చిన్న గ్రామం. కొంకణ్ ప్రాంతంలోనే కలదు. ఈ గ్రామం గణేశ దేవాలయానికి ప్రసిద్ధి. దీని పేరు శ్రీ దశభుజ లక్ష్మీ గణేశ దేవస్ధానం అంటారు. ఇక్కడి గణేశ విగ్రహానికి పది చేతులు ఉండటంచే దీనిని హిందీ భాషలో దశ భుజ దేవస్ధానంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం పేష్వాల కాలంలో నిర్మించబడింది. మార్బుల్ తోనే గణేశ విగ్రహం చేశారు. ఈ మార్బుల్ రాయి జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్రం నుండి తెప్పించబడింది. హెడ్వి లో ఉమా మహేశ్వరి దేవాలయం, మరియు బ్రాహ్మణ్ ఘాల్ కూడా కలవు. బ్రాహ్మణ్ ఘాల్ అనేది ఒక సహజ నీటి బుగ్గ. ఇది సుమారుగా 35 అడుగుల పొడవు మరియు 20 అడుగుల లోతు కలిగి ఉంటుంది. ఇది నల్లరాయితో కలదు. రెండు అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. సముద్రపు ఆటు పోట్లకు ఈ సహజ నీటి బుగ్గ లో నీరు పైకి తన్నుతూ ఉంటుంది.



Click it and Unblock the Notifications