వ్యాదేశ్వర్ దేవాలయం రత్నగిరి జిల్లాలోని గుహఘర్ లో కలదు. గుహఘర్ బీచ్ వలెనే, వ్యాధేశ్వర్ దేవాలయం కూడా గుహఘర్ స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్ డిపో సమీపంలో కలదు. ఇది శివ భగవానుడి దేవాలయం. శివుడితోపాటుగా తల్కేశ్వర్, ఉడాలేశ్వర్, బల్కేశ్వర్ దేముళ్ళ విగ్రహాలు మరియు గణేశ, శ్రీదేవి, శ్రీ విష్ణువు, సూర్యుడి విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి. మహా శివరాత్రి సమయంలో ఈ దేవాలయం భక్తులతో కిట కిట లాడుతుంది. అదే సమయంలో ఒక పెద్ద జాతర కూడా జరుగుతుంది. దానిలో స్ధానికంగా తయారయ్యే వస్తువులను ఎన్నో రకాలను కొనుగోలుకు ప్రదర్శిస్తారు. పర్యాటకులకు ఈ సంత ఎంతో సౌకర్యమైనది.



Click it and Unblock the Notifications