గ్వాలియర్ లో ఇది ఒక ప్రసిద్ధ పురావస్తు మ్యూజియం. ఈ భవనాన్ని రాజా మాన్ సింగ్ తన భార్య మ్రిగానాయని జ్ఞాపకార్ధం నిర్మించాడు. ఆమె గుజారి జాతి కావటం వలన ఇది గుజారి మహల్ గా పేరు పెట్టారు. 1922 లో దీనిని పురావస్తు శాఖ ఒక మ్యూజియం గా మార్చి అనేక పురావస్తు కలాక్రుతులను ప్రదర్శనలో పెట్టింది.
వీటి లో ఒకటవ శతాబ్దం నుండి కల విలువైన జాతి రత్నాలు, టెర్రాకొట్ట వస్తువులు, ఆయుధాలు, పెయింటింగ్ లు, తాళపత్రాలు వుంటాయి. ప్రపంచ ప్రసిద్ధ శలభాన్జిక యక్షి, త్రిమూర్తి నటరాజ్ అర్ధనారీస్వర్, యమ రాజ్ విగ్రహాలు కూడా కలవు. ఇందులో తాన్ సేన్ జీవిన్చాదనేతందుకు గల ఆధారాలు కూడా కలవు. చరిత్ర ప్రియులు ఈ మహల్ తప్పక దర్శించాలి.



Click it and Unblock the Notifications