మాన్ మందిర్ పాలస్ కు చారిత్రక ప్రాధాన్యత కలదు. ఇది అనేక హృదయ విదారక కధలు చెపుతుంది. దీని నిర్మాణంలో మధ్య యుగపు హిందూ శిల్ప శైలి కనపడుతుంది. ఇది ఒక నాలుగు అంతస్తుల భవనం. రెండు అంతస్తులు అండర్ గ్రౌండ్ లో వుంటాయి. ఈ భవనాన్ని 15 వ శతాబ్దం లో తోమార్ వంశానికి చెందిన రాజు మాన్ సింగ్ తోమార్ నిర్మించాడు.
ఆ తర్వాత ఇది అనేక రాజ వంశీకుల చేతులు మారింది. వారిలో రాజపుత్రులు, ఢిల్లీ సుల్తానులు, మొగలాయీలు, మరాఠాలు, బ్రిటిష్ వారు, సిండియాలు , మొదలైనవారు కలరు. భావన లోపలి భాగాలు, ఆకర్షణీయ పెయింటింగ్ లు కలిగి వుంటాయి. భవనం లో ఒక చెరసాల కూడా కలదు. మొగల చక్రవర్తి ఔరంగ్ జేబ్ దీనిలో తన సోదరుడిని హత్య గావించాడు. ఇక్కడ కొలను రాజపుత్ర భార్యలు సతి అనబడి ఆత్మహత్యలు చేసుకోనేటందుకు ఉపయోగ పడేది.



Click it and Unblock the Notifications