ఇది తాన్ సేన్ సమాధి. ఇక్కడే అతని గురువు సమాధి కూడా కలదు. తాన్ సేన్ అక్బర్ ఆస్థానం లో ఒక గొప్ప గాయకుడు. 15 వ శతాబ్దం నాటి వాడు. హిందూస్తాని సంగీత విద్వాంసుడు. తాన్ సేన్ మేఘ మల్హార్ రాగం పాడితే వర్షం పడేదని చెపుతారు. సమాధి మొగల శిల్ప శైలి లో వుంటుంది. ప్రతి సంవత్సరం నవంబర్ , డిసెంబర్ లలో ఇక్కడ ప్రతిష్టాత్మక మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇండియా లోని గొప్ప సంగీతకారులు దీనిలో పాల్గొంటారు.