Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఇటానగర్

ఇటానగర్   -   ఆర్కిడ్ రాజధాని

51

ఇటానగర్ పర్యాటక రంగం - గిరిజనులు యొక్క ఉత్సాహపూరితమైన ఆర్కిడ్ రంగుల మధ్య తేడాను ప్రత్యక్షంగా చూపే ఆర్కిడ్ రాజధాని  అరుణాచల్ ప్రదేశ్ రాజధాని అయిన ఇటానగర్ హిమాలయాల దిగువ ప్రాంతాల వద్ద ఉంది. ఇది పపుంపరె జిల్లా పరిపాలనా పరిధిలోని వస్తుంది. ఇది 1974 వ సంవత్సరం ఏప్రిల్ 20 నుండి రాజధాని నగరంగా ఉన్నది. ఇది భారతదేశం యొక్క అతిపెద్ద ఈశాన్య రాష్ట్ర రాజధాని మరియు రాష్ట్రంలో అతిపెద్ద నగరం.

ఇటానగర్ ను మినీ బారతదేశం అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ దేశం యొక్క అన్ని ప్రదేశాల ప్రజలు ఇక్కడ నివసిస్తారు. ఇది రామచంద్ర రాజు రాజధాని మాయాపూర్ గా గుర్తించబడింది. రామచంద్ర రాజు 14 ,15 వ శతాబ్దంలో జితరి రాజవంశం యొక్క రాజు.

ఇటానగర్ లో మరియు చుట్టూ ఉన్నపర్యాటక స్థలాలు

ఇటానగర్ లో పురావస్తు ప్రదేశాలు, చారిత్రాత్మక ప్రాముఖ్యం మరియు సామాజిక సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. నగరంలో ఉన్న ఇటా ఫోర్ట్ పర్యాటకులకు ప్రత్యెక ఆకర్షణ కేంద్రంగా ఉన్నది. నగరం యొక్క పేరు ఈ కోట నుండి వచ్చింది.

బొమ్డిల పరశురామ్ కుండ్, మలినితాన్ మరియు భిష్మాక్ నగర్ వంటి ఇతర ఆకర్షణలను బస్సు లేదా టాక్సీ ద్వారా చేరవచ్చు. ఇటానగర్ లో ఉన్న రాజ్ భవన్ గవర్నర్ అధికార నివాసం కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది.

ఇతర పర్యాటక ఆకర్షణలుగా గంగా సరస్సు, జవహర్ లాల్ నెహ్రూ మ్యూజియం మరియు చేతి పనుల సెంటర్ మరియు ఎంపోరియం ఉన్నాయి. ఈ మ్యూజియం అరుణాచల్ ప్రదేశ్ సంస్కృతి మరియు వారసత్వం మరియు అనేక గిరిజన సేకరణలు కలిగి ఉంది.

గంగా సరస్సు చుట్టూ వృక్ష సంపద మరియు రాతి పరిమాణముతో చుట్టూ ఆకర్షణీయముగా ఉంటుంది. చేతి పనుల సెంటర్ వద్ద ప్రదర్శనలలో మైమరిచే గోడ మీద చిత్రించే చిత్రాలు, వెదురు మరియు కొయ్య వస్తువులు మరియు సంప్రదాయ దుస్తులు ఉంటాయి.

ప్రయాణికులకు విశ్రాంతి కోసం ప్రత్యేకంగా జూలాజికల్ పార్క్, ఇందిరా గాంధీ పార్క్ మరియు పోలో పార్క్ ఉన్నాయి. బుద్ధ విహార్ దలైలామా కొరకు కొత్తగా నిర్మించిన బౌద్ధ ఆలయం. గొంప బౌద్ధ దేవాలయం కూడా దలైలామాకు అంకితం చేయబడింది.

టిబెటన్ నిర్మాణం అయిన పసుపు పైకప్పుగల విగ్రహం ఇటానగర్ మరియు దాని పరిసరాలకు సుందరమైన అందంను పెంచుతుంది. రాష్ట్ర వివిధ మూలల నుండి ఈ స్థలంను చేరటానికి అసంఖ్యాకమైన మార్గాలు ఉన్నాయి. బండి లాగు ఔత్సాహికులు ఇటానగర్ ను ఇష్టపడతారు.

పర్యాటక రంగంనకు అనువుగా సమాచారాన్ని అరుణాచల్ ప్రదేశ్ నుండే కాకా పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు మేఘాలయ వంటి రాష్ట్రాల్లో నుండి కూడా తెలుసుకోవచ్చు.

ప్రజలు మరియు సంస్కృతి

నగరం యొక్క గరిష్ట జనాభాలో వివిధ తెగల ఉన్నారు. న్యిషి తెగ వారు ఎక్కువగా ఉంటారు. వారిని నిశిస్ లేదా నిశింగ్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రజలు బౌద్ధమతంనకు అంకితం అవుతారు. ఇటానగర్ నివాసులు ఉల్లాసమైన మరియు ఏడాది పొడవునా ఉత్సవ మానసిక స్థితిలో ఉంటారు. న్యోకుం అనే పండుగ న్యిషి తెగలకు ముఖ్యమైన పండగలలో ఒకటిగా ఉంది.

మొన్పాస్ అనే మరొక తెగ వారు లోసార్ అనే పండుగను జరుపుకుంటారు. ఇది నూతన సంవత్సర వేడుక. ప్రజలు ప్రార్థనలు చేస్తారు మరియు మతపరమైన జెండాలు పైకెత్తుతారు. బౌద్ధ గ్రంధములను చదువుతారు. ఈ పండుగ ఐదు రోజులు కొనసాగుతుంది. రెహ్ పండుగ లడు మిశిమిస్ అనే తెగ వారు జరుపుకునే మరో కీలకమైన పండుగ. ఇది పూజారి నృత్యం ద్వారా గుర్తించబడింది. తమ్లడు అనే పండుగను దిగారు మిశిమిస్ తెగ వారు జరుపుకుంటారు. అంతేకాక ఖాన్,సంగ్కేన్ మరియు మోపిన్ లు ఇతర పండుగలుగా ఉన్నాయి.

ఇటానగర్ లో కూడా అనేక ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థలు ఉన్నాయి.

ఇటానగర్ ను సందర్శించడానికి ఉత్తమ సమయం

ఇటానగర్ ను ఏడాది పొడవునా సందర్శించవచ్చు. రాజధాని నగరం వద్ద వాతావరణ ఎల్లప్పుడూ ఉల్లాసంగాను మరియు ఆహ్లాదకరంగాను ఉంటుంది. సందర్శకులు ఏ సమయంలోనైన ఇక్కడకు రావచ్చు.

ఇటానగర్ చేరుకోవడంఎలా

రాష్ట్ర రాజధాని అయిన ఇటానగర్ రోడ్డు ద్వారా, విమాన మార్గం ద్వారా బాగా అందుబాటులో ఉంటుంది. సమీప రైల్వే స్టేషన్ అస్సాం లో హర్ముతి లో ఉంది.

ఇటానగర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఇటానగర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఇటానగర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఇటానగర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ఇటానగర్ కు బాగా అస్సాం మరియు జాతీయ రహదారి 52A ద్వారా మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడినది. గౌహతి నుండి నహర్లగున్ కు బస్సు సౌకర్యం ద్వారా రాజధాని నగరంను సులభంగా చేరుకోవచ్చు. బందేరదేవ, ఉత్తర లఖింపూర్, తేజ్పూర్ మరియు అస్సాం ఇతర ప్రదేశాలకు కూడా బస్సు ద్వారా ఇటానగర్ అనుసందానము ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ఇటానగర్ లో రైల్వే స్టేషన్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే లైన్లు లేకపోవడం వలన రైల్వే ద్వారా చేరలేము. కానీ అస్సాంలో ఉన్న హర్ముతి సమీప రైల్వే స్టేషన్. ఇది ఇటానగర్ నుండి 32km దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం హెలికాప్టర్ సేవలు గౌహతి, అస్సాం నుండి రెగ్యులర్ గా అందుబాటులో ఉంటాయి. ఈ సేవలు ఏర్పాటు మరియు నిర్వహించేది పవన్ హన్స్ మరియు హెలికాప్టర్లు రాకపోకలు గౌహతి నుండి నహర్లగు వరకు ఉంటాయి. నహర్లగు ఇటానగర్ నుండి 10Km దూరంలో ఉంది. పపుంపరె జిల్లాలో హోలోంగి వద్ద ప్రణాళిక వేసుకొంటే ఇటానగర్ విమాన ప్రయాణం పర్యాటకులకు బాగుంటుంది. అస్సాం లో తేజ్పూర్ మరియు లిలబరి సమీప విమానాశ్రయాలుగా ఉన్నాయి. లిలబరి ఇటానగర్ నుండి 71km దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed