Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» జగేశ్వర్

జగేశ్వర్ - ఒక ప్రసిద్ధ మత పట్టణం

13

జగేశ్వర్ సముద్ర మట్టానికి 1870 మీటర్ల ఎత్తులో ఉంది . ఉత్తరాఖండ్ లో అల్మోర జిల్లాలో నెలకొని ఉన్న ఒక ప్రసిద్ధ మత పట్టణం. చరిత్ర ప్రకారం, ఈ స్థలం ఒకప్పుడు లకులిష్ శైవత్వాన్ని కేంద్రంగా సేవలు అందించింది. పట్టణం జతగంగా నది లోయ సమీపంలో ఉంది మరియు ఆ ప్రాంతంలో వైభవంగా విస్తారిత పచ్చిక బయళ్లు దేవదారు చెట్లు ఉంటాయి.

ఈ ప్రదేశం 12 జ్యోతిర్లింగాలలో ఎనిమిదవది కనిపించిన ప్రదేశము కనుక దీనిని నగేష్ జ్యోతిర్లింగా అని పిలుస్తారు. ఈ ప్రదేశం చుట్టూ హిందూ మత దేవుడైన శివకు అంకితం చేయబడిన 124 పెద్ద మరియు చిన్న ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రదేశం ఆలయం నగరంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం 9 వ నుండి 13 వ శతాబ్దం మధ్య కాలంలో నాటిదని చరిత్ర చెప్పుతోంది.దందేశ్వర్ ఆలయం, జగేశ్వర్ ఆలయం, చండికా ఆలయం, మహామృత్యుంజయ ఆలయం, కుబెర్ ఆలయం, నవ-గ్రహ ఆలయం, మరియు నందా దేవి ఆలయం ఇక్కడ ప్రముఖ దేవాలయాలుగా ఉన్నాయి.వీటిలో మహామృత్యుంజయ ఆలయం పురాతనమైనది మరియు దందేశ్వర్ ఆలయం అతి పెద్దదిగా ఉంది. బడ్ జగేశ్వర్ ఆలయం, పుష్టి భగవతి మా మరియు ఆర్కియాలజికల్ మ్యూజియం ఈ ప్రదేశంలో చూడవలసిన ఇతర పర్యాటక ఆకర్షణలు.

జగేశ్వర్ లో మాన్సూన్ ఫెస్టివల్ ఒక ప్రసిద్ద కార్యక్రమం మరియు ప్రతి సంవత్సరం 15 జూలై మరియు ఆగస్టు 15 మధ్య వచ్చే హిందూ మత నెల అయిన శ్రావణ మాసంలో జరుపుకుంటారు. ఇది కాక, ఒక ప్రముఖ హిందూ మత పండుగ మహా శివరాత్రిని కూడా అత్యంత భక్తి మరియు ఉత్సాహంతో ఇక్కడ జరుపుకుంటారు.

జగేశ్వర్ ను చేరుకోవటానికి విమాన,రైలు,రోడ్డు మార్గాలు ఉన్నాయి. పంత్నగర్ విమానాశ్రయం సమీప విమానాశ్రయంగా ఉంది. కత్గోడం రైల్వే స్టేషన్ సమీప రైల్వేస్టేషన్ గా ఉంది. పర్యాటకులకు జగేశ్వర్ కు చేరటానికి పితోరగర్, హాల్డ్వాని మరియు అల్మోర నుండి ప్రభుత్వం లేదా ప్రైవేటు బస్సులు లభిస్తాయి.

జగేశ్వర్ పర్యటనకు యాత్రికులకు వాతావరణం వేసవి కాలంలో సౌకర్యవంతముగా ఉంటుంది.

జగేశ్వర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

జగేశ్వర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం జగేశ్వర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? జగేశ్వర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం జగేశ్వర్ కు సాధారణ బస్సు సేవలు సమీపంలోని స్థలాల నుండి అనుసంధానించబడింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బస్సులు జగేశ్వర్ కు అల్మోర ,పితోరగర్, మరియు హాల్డ్వాని వంటి గమ్యం నుండి అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం కత్గోడం రైల్వే స్టేషన్ జగేశ్వర్ సమీపంలోని రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కూడా సాధారణ రైళ్లు లక్నో, ఢిల్లీ, మరియు కోలకతా వంటి భారతీయ గమ్యస్థానాలకు అనుసంధానించబడింది. టాక్సీలు రైల్వే స్టేషన్ నుండి జగేశ్వర్ కు అందుభాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఒక ప్రసిద్ధ మత పట్టణం
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jun,Wed
Check Out
11 Jun,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu