ఆల్బర్ట్ హాల్ ను 1886 లో సవాయి రామ్ సింగ్ మహారాజు రూ. 4 లక్షల కరువు సహయక ప్రణాళిక లో భాగంగా కట్టించాడు. ఇది జైపూర్ లోని అందమైన రాం నివాస్ బాఘ్ దగ్గరలో ఉంది.ఈ కట్టడాన్ని సర్ స్వింటన్ జాకబ్ రూపొందించాడు. ప్రస్తుతం, ఆల్బర్ట్ హాల్ను లోహ శిల్పాలు, చిత్రాలు, ఏనుగు దంతాలు, తివాచీలు, రంగు స్పటికాల గొప్ప సేకరణ ను ప్రదర్శించే మ్యూజియంగా ఉపయోగిస్తున్నారు. దగ్గరలో ఒక జంతు ప్రదర్శన శాల, రవీంద్ర రంగ మంచ్ ( థియేటర్) ఉన్నాయి.
అల్బెర్ట్ హాల్ మ్యూజియం సందర్శకుల కోసం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. భారతీయులకు రూ. 20 విదేశీ పర్యాటకులకు రూ.150 లతో నామమాత్రమైన ప్రవేశ రుసుము ఉంటుంది.



Click it and Unblock the Notifications