Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైపూర్ » ఆకర్షణలు » సిటీ ప్యాలెస్

సిటీ ప్యాలెస్, జైపూర్

9

జైపూర్ మధ్యలో ఉన్న సిటీ భవనం పూర్వ సంస్కృతికి చెందిన ఒక ప్రముఖ ప్రాంతం. ఇది నగరంలోని పెద్ద భవనాలలో ఒకటి. ఈ అందమైన భవనాన్ని జైపూర్ రూపకర్త సవాయి జై సింగ్ మహారాజు కట్టించాడు. ఈ భవనం రాజపుత్రుల, మొఘలుల నిర్మాణ శైలుల అందమైన సమ్మేళనం.ఈ సముదాయ ప్రవేశం వద్ద ముబారక్ మహల్ (లేదా స్వాగత భవనం) ఉంది. 19 వ శతాబ్దం లో సవాయి మధో సింగ్ కట్టించిన ఈ భవనాన్ని స్వాగత ప్రాంతం గా ఉపయోగించేవారు. ప్రస్తుతం మ్యూజియంగా మారిన ఈ భవనాన్ని జైపూర్ రాజు రెండో సవాయి మాన్ సింగ్ కు అంకితం చేశారు. ఈ మ్యూజియం లో రాజులు వాడిన అనేక దుస్తుల తో బాటుగా బనారస్ పట్టు చీరలు, పష్మిన శాలువాలు ప్రదర్శనకు ఉంచారు. సవాయి మధో సింగ్ మహారాజు (1750-1768) వాడిన భారీ దుస్తులను కూడా ఇక్కడ చూడ వచ్చు.సిటీ ప్యాలెస్ సముదాయంలో పురాతన రాజపుత్రుల ఆయుధాలను గర్వంగా ప్రదర్శించే మహారాణి భవనం లేదా క్వీన్స్ ప్యాలెస్ ను చూడవచ్చు. ఈ మ్యూజియం లో ఏనుగు దంతపు పిడిగల కత్తులు, గొలుసు కవచాలు, తుపాకులు, చిన్న తుపాకులు, ఫిరంగులు, విషపు కొన వుండే కత్తులు, మందు గుండు సామగ్రి సంచులను చూడవచ్చు. వీనిలో కత్తిరించే బాకు ప్రసిద్ధ ఆయుధం. వీనిలో కొన్ని ఆయుధాలు 15 వ శతాబ్దానికి చెందినవి.సందర్శకుల కోసం ఉదయం 9 నుండి సాయంతం 5 గంటల వరకు తెరిచి ఉంచే సిటీ భవనం ప్రవేశ రుసుము భారతీయులకు రూ.75 విదేశీ పర్యాటకులకు రూ. 300 ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed