జోర్హాట్ జిల్లా కేంద్రానికి దగ్గరగా వుండే చిన్న గ్రామం కరంగా. కరంగా గ్రామం ఇక్కడి కంసాలి వృత్తికి ప్రసిద్ది పొందింది. కరంగా కంసాలులు దగ్గరలోని తేయాకు తోటలకు కావలసిన పరికరాలు తయారు చేస్తారు. ఈ తేయాకు తోటల దగ్గర వుండే వారు ఈ కరంగా కంసాలులకు ప్రధాన వినియోగదారులు.
కరంగా కంసాలి వారు తేయాకు తోటల కోసమే కాక జోర్హాట్ లోని స్థానికులకు కూడా కావలసిన పనిముట్లు అందిస్తారు.
ఈ గ్రామ౦ చూస్తె అస్సాం లోని ప్రాచీన కంసాలి పనితనం నిదర్శనం చూడవచ్చు. ఆసక్తి కల పర్యాటకుల కోసం ఇక్కడి కంసాలులు తమ ద్వారాలు తెరవడమే కాదు, వారికి ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తారు. యాత్రికులు కొన్ని కళాకృతులను కరంగా కంసాలులనుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు. జోర్హాట్ నగర కేంద్రం నుంచి కాబ్ ల ద్వారా ఇక్కడికి చేరుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications