దేశీయ పర్యాటకులకు అధిక ఆకర్షణకల పర్యాటక ప్రదేశం జున్నార్ మహారాష్ట్రలోని పూనే జిల్లాలో కలదు. జున్నార్ పట్టణం దాని మతపర, చారిత్రక మరియు పౌరాణిక ఆకర్షణలకు ప్రసిద్ధి. ఎన్నో పురాత దేవాలయాలు, చక్కగా ఆకర్షించే గుహలు, మరియు కోటలు వంటివి ఇక్కడ కలవు. సహ్యాద్రి పర్వత శ్రేణులలో కల జున్నార్ పూనేకు ఉత్తర దిశగా సుమారు 94 కి.మీ.ల దూరంలో కలదు. ఇది ముంబై నగరానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ పట్టణం సముద్రమట్టానికి సుమారు 2260 అడుగుల ఎత్తుకంటే అధికంగా కలదు.
జున్నార్ - ఒక చారిత్రక ప్రదేశం జున్నార్ చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. సుమారు వేయి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. ఈ చారిత్రక స్ధలం శివనేరి కోటకు సమీపంలో కలదు. శివనేరి కోట ప్రఖ్యాత మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ రాజ భోస్లే జన్మస్ధలం. జున్నార్ మొదటగా జిమా నగర్ అని పిలువబడేది. శక రాజ వంశ పాలనలో రాజు నహాపాన్ కు ఈ ప్రదేశం ప్రధాన నగరంగా వ్యవహరించింది. తర్వాతి కాలంలో దీనిని శాతవాహన రాజులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఎంతో వ్యూహాత్మకంగా అప్పటి వాణిజ్య మార్గమైన నానేఘాట్ పై ఒక కన్ను వేసి పర్యవేక్షించాలని శివనేరి కోటను నిర్మించాడు. శిల్పకళలకు కేంద్రం జున్నార్ పట్టణం దాని శిల్ప సంపదలతో ప్రసిద్ధి గాంచటానికి, కారణం జున్నార్ గుహలని చెప్పాలి. ఇక్కడ మూడు గుహల సముదాయాలు కలవు. మన్మోడి హిల్ గ్రూప్, గణేష్ లేనా గ్రూప్ మరియు తులిజా లేనా గ్రూప్ అని మూడు గ్రూపుల గుహలు కలవు. అన్ని గుహలలోను అందమైన రాతి శిల్ప కళా వైభవం కనపడుతుంది.
ఈ గుహలే కాక, ఇక్కడే కల మరో 30 లేన్యాద్రి గుహలు ఈ ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయం చేశాయి. జున్నార్ ఆకర్షణ వెనుకగల వాస్తవం ఏమంటే, ఈ ప్రాంతంలో చిరుత పులులు అధికంగా నివసిస్తాయి. షుమారు 500 చ.కి.మీ.ల పరిధిలో ఇవి సంచరిస్తూ ఉంటాయి. ఈ ప్రదేశం వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలతో తేలికగా చేరుకోవచ్చు కూడాను. అన్నిటికి మించి ఈ ప్రదేశంలో సంవత్సరం పొడవునా ఉండే ఆహ్లాదకర వాతావరణం కూడా పర్యాటకులకు ఇది ఒక మంచి విహార స్ధలంగా భావించబడుతుంది.



Click it and Unblock the Notifications