ఇంతకుముందు నాగర్కొట్ గా పిలువబడే ఈ నాగర్కొట్ ఫోర్ట్ కాంగ్రా లో ని మరియొక ప్రఖ్యాత పర్యాటక స్థలం. కాంగ్రా లోయకి అభిముఖం గా ఉన్న ఈ ఫోర్ట్ బంగంగా మరియు మంజిహి స్ట్రీమ్స్ కలిసే స్థలం లో ఉన్న రాతి పైన ఉంది. ఈ కోటకి పెద్ద పెద్ద చెక్క తలుపులు ఉన్నాయి. రంజిత్ సింగ్ దర్వాజ్, జేహన్గిరి దర్వాజ్ తో పెద్ద పెద్ద ప్రాకారాల ద్వారా కలుపబడింది. ఈ జహంగీర్ దర్వాజ్ ద్వారా జహంగీర్ ప్రార్ధించినటువంటి మాస్క్ కి చేరుకోవచ్చు.
ఇక్కడ ఉన్న మెహ్రాబ్ అనే ఆర్చ్ , శిధిలాలను కూడా పర్యాటకులు చూడవచ్చు.
ఆంధ్రేరి దర్వాజా ఈ మెహ్రాబ్ అర్చి కంటే ముందు కనిపిస్తుంది, ఈ తలుపులన్నిటి లో , దర్శిని దర్వాజా పురాతనమైనది. ఈ తలుపుకుండా వెళ్తే ఆకర్షనీయమైన సభా స్తలాన్ని , రాతితో తాపడం చెయ్యబడిన ప్రదేశాన్ని చేరుకోవచ్చు. ఎంతో మంది రాజులు ఇక్కడ అనేక మతాల కు చెందిన రూపాలని నిర్మించారు. ఇక్కడ జైన మందిరాలు, అందమైన కోవెలలు , సీష్ మహల్ - అద్దాల తాపడం చేసిన గది కోట పై భాగాన చూడవచ్చు.
ఈ కోట పైనుండి, మరియు వాచ్ టవర్ పైన నుండి అద్భుతమైన సుందర ప్రదేశాన్ని పర్యాటకులు వీక్షించవచ్చు.