కన్నూర్ కి 20 కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రఖ్యాత వారసత్వ భవనం ఒక మంచి పర్యాటక ప్రదేశం. ఈ భవనం అందమైన పర్వతం పైన ఉన్నది. ఈ పర్వతం పేరు ఇల్లికున్ను. ఇది తలస్సేరి పట్టాణ సమీపంలో అలాగే నదీ ప్రవాహాల సమీపంలో ఉండడం వల్ల కనులకి పండుగగా ఉంటుంది.
ప్రఖ్యాత రచయిత, విద్వాంసులు అయిన డాక్టర్ హెర్మన్ గుందేర్ట్ ఇక్కడ 1839 నుండి నివసించారు. గుందేర్ట్ ఏంతో ప్రఖ్యాత పండితులే కాక జర్మన్ మిషనరీ కార్య కలాపాలు కొనసాగించారు. వీరు మొట్టమొదటి, మలయాళం - ఇంగ్లీష్ నిఘంటువుని అందుబాటులోకి తెచ్చారు. రాజ్యసమాచారం అనబడే మొట్టమొదటి మలయాళ వార్తాపత్రిక ఇంకా పస్చిమోదయం అనే మరొక ప్రచురణ ని నిర్వహించారు.
గుందేర్ట్ 20 ఏళ్లుగా నివసించిన ఈ భవనం చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కల ప్రదేశంగా పేరు గడించింది. నెత్తుర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, గుందేర్ట్ మెమోరియల్ చర్చ్ ఇంకా సిమెటరీ ఈ భవనానికి దగ్గరలో ఉన్న మరికొన్న ఆకర్షణలు. ఈ భవనం ఇంగ్లీష్ నిర్మాణ శైలి కి ఒక చక్కని ఉదాహరణ. చుట్టు పక్కల సుందరమైన ప్రదేశాలతో కలిసి ఈ భవనం పర్యాటకులని ఆకర్షిస్తోంది.



Click it and Unblock the Notifications