మప్పిల బె లేదా మోపిల బె గా ప్రఖ్యాతి గాంచిన ఈ బీచ్ కన్నూర్ పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అయిక్కర గ్రామంలో ఉంది. సహజ రేవు కలిగిన ప్రదేశంగా చరిత్ర కలిగిన ఈ బె ఫోర్ట్ సెయింట్ ఏంజెలో ఒక పక్క అరక్కల్ పాలస్ ఒక పక్క ఉండగా సుందరంగా శోబిల్లుతుంది.
కొలతిరి పాలనా నుండి ఉన్న చారిత్రక విశేషంగల ఈ రేవు ఇప్పటికి పురాతన వెలుగులని చిందుతుంది. కొలతునాడు ఒక వాణిజ్య కేంద్రంగా పేరెన్నికగన్న ఈ రేవు చుట్టుపక్కల దేశాలతో వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకుంది. పర్యాటకుల కు ఒక రోజు సందర్శన లో ఈ రేవు ప్రాంతం ఫోర్ట్ సెయింట్ ఏంజెలో మరియు అరక్కల్ పాలస్ ని సందర్శించడం సబబు గా ఉంటుంది.
సముద్రం నుండి అంతర్భాగ తీర జల ప్రదేశాన్ని వేరు చేస్తూ ఉండే గోడ పడవల రాకపోకలను పరిరక్షిస్తుంది. పర్యాటకులు ఈ తీరప్రాంతం పడవ షికారు ని ఆనందించవచ్చు. ఇండో నార్వేజియన్ పాక్ట్ ద్వారా పునర్నిర్మితమైన స్థానిక ఫిషింగ్ కేంద్రం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది.



Click it and Unblock the Notifications