రామత్ర కోట రాజస్ధాన్ లోని కరౌలి జిల్లాలో కేలా దేవ్ ఘన బర్డ్ శాంక్చురీ మరియు రణధంబోర్ టైగర్ రిజర్వ్ ల మధ్య కలదు. కేలా దేవి శాంక్చురీ దీనికి సమీపంగా ఉంటుంది. సుమారు 15 కి.మీ. ల దూరం. పర్యాటకులకు ఈ కోట అక్కడి గ్రామీణ సౌందర్యాలను చూపుతుంది. ఈ కోటను 1645 లో ఒక జాగీరుగా ఠాకూర్ భోజ్ పాల్ కు అతడి తండ్రి అయిన కరౌలి మహరాజు బహుకరించాడు. ఇపుడు దీనిని ఠాకూర్ బ్రిజేంద్రపాల్ మరియు అతని కుటుంబం నిర్వహిస్తోంది. కోటలో రెండు దేవాలయాలుంటాయి. ఒకటి గణేశుడిది కాగా మరొకటి శివుడిది. శివాలయంలో శివుడి విగ్రహం మార్బుల్ రాతితో 18వ శతాబ్దపు శిల్ప శైలి కలిగి ఉంటుంది.
కోటకు వెళ్ళే మార్గంలో పర్యాటకులు అందమైన ప్రదేశాలను అక్కడి సాగు భూములలో చూడవచ్చు. ఎన్నో సుందరమైన పక్షులు అక్కడి సరస్సులపై ఎగరటం చూస్తారు. భరత్ పూర్ బర్డ్ శాంక్చురీ సమీపంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications