దేవ్ బాగ్ బీచ్ కార్వార్ లో తప్పక చూడవలసిన ప్రదేశం. ఇది కార్వార్ బీచ్ కు 4 కి. మీ. ల దూరంలో ఉంటుంది. ఈ బీచ్ చేరాలంటే, పర్యాటకులు కార్వార్ నుండి ఫెర్రీలో ప్రయాణించాలి. ఇక్కడ జంగిల్ లాజ్ రిసార్ట్ ఉంది. దేవ్ బాగ్ బీచ్ కాలుష్య, శబ్ద రహితంగా ఉండి అందరికి ఎంతో ఇష్టం కలిగిస్తూంటుంది. హానీమూన్ జంటలకు స్వర్గంలా ఉంటుంది. నీటి క్రీడలు కూడా అనేకం ఆడవచ్చు. స్కూబా డైవింగ్, పారాసైలింగ్, బనానా బోట్ రైడ్, బోట్ క్రూయిస్, స్నోర్ కెల్లింగ్ ప్రధాన ఆటలుగా ఉంటాయి. పర్యాటకులు బోట్ లేదా ట్రాలర్ లో ప్రయాణించి ఇక్కడి ద్వీపాలు చూడవచ్చు. సమీప కొండలపై ట్రెక్కింగ్ చేయవచ్చు. దేవ్ బాగ్ రెస్టరెంట్లలో అంతర్జాతీయ, స్ధానిక వంటకాలు ఉంటాయి. దేవ్ బాగ్ బీచ్ నుండి సదాశివగడ ఫోర్ట్ కు వెళ్ళ వచ్చు. వెంకటరమణ దేవాలయం, నాగనాధ్ దేవాలయం కూడా ఇక్కడకు సమీపంలో ఉంటాయి. అక్టోబర్ నుండి మార్చి వరకు దేవ్ బాగ్ బీచ్ సందర్శన బాగుంటుంది.



Click it and Unblock the Notifications