600 సంవత్సరాల క్రిదటి దుర్గ దేవాలయం కార్వార్ లోని సదాశివ హిల్ ఫోర్ట్ లో కలదు. సదాశివగఢ్ కాళీ నదికి ఉత్తరంగా ఉంటుంది. నగరానికి 6 కి.మీ. దూరం. దీనిని శివ ఛత్రపతి రాజు కనుగొన్నాడని చెపుతారు. దుర్గ గుడికి వెళ్ళే దోవలో పర్యాటకులు సోండా రాజుల కోట శిధిలాలను కూడా చూడవచ్చు. ఇక్కడే కల శాంతా దుర్గ గుడి 17వ శతాబ్దికి చెందిన పీర్ షాన్ షంషుద్దీన్ ఖరోబాట్ దర్గా సమీపంలో కలదు. వసతి కొరకు టూరిజం శాఖ సదాశివగఢ్ కొండపై యాత్రి నివాస్ ఏర్పరచింది.



Click it and Unblock the Notifications