కర్నాటక రాష్ట్రంలోని ప్రధాన బీచ్ లలో కార్వార్ ఒకటి. ఇది పడమటి వైపు అరేబియా సముద్రం తూర్పువైపు పడమటి కనుమలు కలిగి ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో విహరించాలనుకునేవారికి ఇది మంచి ప్రదేశం. పర్యాటకులు ఈ బీచ్ లో సన్ బేతింగ్, స్విమ్మింగ్, ఫిషింగ్ మరియు నీటి ఆటలు ఆనందించవచ్చు. ఈ బీచ్ చూసే ప్రజలు స్ధానిక రుచికల ఆహారాలను పొందేందుకు బీచ్ లో ఎన్నో ఆహార ప్రదేశాలున్నాయి. నోటి రుచులూరే సముద్రపు ఆహారం, కొబ్బరి వంటివి బాగుంటాయి. కార్వార్ వచ్చిన వారు కార్వార్ బీచ్ సంవత్సరంలో ఏ సీజన్ అయినప్పటికి తప్పక చూడాల్సిందే. సాధారణంగా దీనిని చూడాలంటే సెప్టెంబర్ మరియు మే నెలల మధ్య అనుకూలంగా ఉంటుంది. కార్వార్ బీచ్ చుట్టుపట్ల చూడవలసిన ప్రదేశాలు...కుర్మగడ్ ద్వీపం, దర్గా ఆఫ్ పీర్ షాన్ షంషుద్దీన్ ఖరోబట్, దేవ్ బాగ్, సదాశివగడ్ హిల్ ఫోర్ట్, నాగనాధ దేవాలయం వంటివి ప్రసిద్ధి.



Click it and Unblock the Notifications