Search
  • Follow NativePlanet
Share

ఖొడాల - ఒక సమీక్ష

7

మహారాష్ట్రలోని ధానే జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 1800 అడుగుల ఎత్తున కల ఖొడాల ఒక సుందరమైన గ్రామం.  ప్రశాంత వాతావరణానికి ప్రసిద్ధి గాంచిన ఖొడాల దానిలోని ఆకర్షణలు అంటే వైతరణి సరస్సు, ఇగాత్ పురి - కాసర ఘాట్ మరియు ట్రింగల్ వాడి కోటలతో ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది.  ఒక సుందర దృశ్యాల అద్భుతం

ఖొడాల ప్రధానంగా కొండ ప్రాంతాల మధ్య దట్టమైన ప్రదేశంలో ఉండటం చేత ట్రెక్కింగ్ మరియు విహార స్ధలంగా కూడా పరిగణించబడుతుంది. ఖొడాల చాలా సాంప్రదాయక వాతావరణం కలిగి ప్రశాంతమైన అటవీ ప్రదేశంలో పర్యాటకుల వినోద విహారాలకు సిద్ధంగా ఉన్నట్లనిపిస్తుంది.  

ముంబై మరియు పూనేల వంటి నగరాల పక్కనే ఉన్నప్పటికి ఖొడాల బాగా పేరుపడలేకపోయింది. ఈ ప్రదేశం చాలావరకు స్ధానిక గిరిజనుల సంస్కృతి కలిగి ఉంటుంది. నేటికి ఇక్కడి ప్రజలు జంతు సంబంధిత ఆచారాలు ఆచరిస్తారు. నేడు మనమంతా ఆధారపడే ఆధునిక సాంకేతికతలు వీరికి ఏ మాత్రం చేరలేదు.

నేటికి గిరిజనుల జానపదాలు, సంగీత నాట్యాలు, దుస్తులు వంటివి ప్రకృతికి సమీపంగా ఉంటాయి.  

ప్రధాన ఆకర్షణలు

ఖొడాల ట్రెక్కర్లకు ఆకర్షణీయ స్ధలం. ట్రెక్కింగ్, మౌంటెన్ బైకింగ్, కొండలను తాళ్ళతో అధిరోహించడం వంటి సాహస చర్యలు చేయాలనుకునేవారికి ఒక మంచి ప్రదేశం.  ఇక్కడకల అమల వైల్డ్ లైఫ్ శాంక్చురీ దాని వివిధ సరీనృప సమూహాలతో ప్రకృతి ప్రియులను ఉత్సాహపరుస్తుంది. శాంక్చురీలో కల వివిధ మొక్కలు, వృక్షాలు ఎంతో అందంగా కనపడుతూ వలస పక్షులను ఆకర్షిస్తూంటాయి. ఖొడాల సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగానే ఉన్నప్పటికి శీతాకాల సమయం సందర్శనకు అనుకూలమైనది. గిరిజనుల నాట్యాలను చూడాలంటే వారి పండుగల సమయంలో సందర్శన మరింత బాగుంటుంది.

ఖొడాల చేరాలంటే, వాయు, రైలు మరియు రోడ్డు మార్గాలు అనుకూలం. ఖొడాలకు సమీపంలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని అన్ని నగరాలకు, మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలకు విమాన ప్రయాణాలకు అనుకూలం. రైలు ప్రయాణంలో ఖొడాల చేరాలనుకునేవారికి ఇగాత్ పురి రైలు స్టేషన్ దీనికి 30 కి.మీ.ల దూరంలో ఉంటుంది. అయితే, మీరు కనుక 450 కి.మీ.ల నుండి 500 కి.మీ.ల దూరంలో ఉండే వారై స్వంత వాహనంలో ప్రయాణించాలనుకుంటే, అది మరింత ఆనందాన్నిస్తుంది.   

ఖొడాల ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఖొడాల వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఖొడాల

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఖొడాల

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ఖొడాల గ్రామం చేరాలంటే రోడ్డు మార్గం ఎంతో తేలిక. ఖొడాల గ్రామం రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు పట్టణాలకు కలుపబడి ఉంది. ప్రభుత్వ బస్సులు మరియు ప్రయివేట్ టూర్ బస్సులు లభ్యంగా ఉంటాయి. పూనే, ముంబై మరియు ఇగాత్ పురి పట్టణాలనుండి రోజూ ఖొడాలకు బస్సులు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం ఖొడాలకు సమీప రైలు స్టేషన్ ఇగాత్ పురి. ఇక్కడనుండి మహారాష్ట్ర లోని పూనె, ముంబై వంటి పట్టణాలకు రైలు సౌకర్యం కలదు. ఇగాత్ పురి స్టేషన్ వెలుపల ఖొడాల చేరేందుకు టాక్సీ లేదా క్యాబ్ సౌకర్యం కలదు. టాక్సీ ధర షుమారుగా రూ.600 వరకు ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం ఖొడాల చేరుకోవాలంటే, ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఇది సుమారు 30 కి.మీ.ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని పట్టణాలకు, నగరాలకు విమాన రాకపోకలు కలిగి ఉంది. విదేశాలలోని వివిధ నగరాలకు కూడా ఇక్కడినుండి విమానాలు ప్రయాణిస్తాయి. విమానాశ్రయంనుండి ఖొడాలకు టాక్సీలు అందుబాటులో ఉంటాయి. నాసిక్ లోని గాంధీనగర్ విమానాశ్రయం మరియు పూనే లోని లోహేగాంవ్ విమానాశ్రయంలు కూడా ఖొడాల విమానంలో చేరాలనుకునేవారికి అనుకూలంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri