తిరిక్కర (Thirikkara) అనే చిన్న గ్రామంలో ఉన్న వామన మూర్తి టెంపుల్ ని తిరిక్కకర టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఎర్నాకుళం నగరం నుండి ఈ గుడి 10 కి మీ ల దూరంలో ఉంది. విష్ణు మూర్తి అవతారమైన వామనుడిని ఈ గుడిలో పుజిస్తారు. విశాలమైన సుందరమైన ప్రదేశంలో ఈ గుడి ఉంది. ఓనం పండుగని ఇక్కడ బాగా జరుపుకుంటారు.
పురాణాల ప్రకారం కేరళ ని పాలించిన బలి చక్రవర్తికి స్వర్గం దక్కకుండా కాపాడడానికి వామనుడి రూపంలో వెళ్లి బలి చక్రవర్తిని పాతాళానికి పంపిస్తాడు. ఓనం పండుగని 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఓనం పండుగ రోజున బలి చక్రవర్తి తిరిగి బయటికి వస్తాడని ఇక్కడి ప్రజల నమ్మకం. ఓనం పండుగని ఏంతో ఉత్సాహంగా , బ్రహ్మాండంగా జరుపుకుంటారు.
ఓనం నాడు ప్రత్యేకించి చేసే ఒనసాధ్య విందు ఓనం వేడుకలలో అతి గొప్ప భాగం. ఏంతో మంది సందర్శకులు ఈ సమయం లో గుడిని సందర్శించేందుకు ఉత్సాహం కనబరుస్తారు.



Click it and Unblock the Notifications