కొహిమా పర్యాటకులకు డిప్యూటీ కమశానర్ బంగాళా ఒక ప్రసిద్ధ ఆకర్షణ. ఈ బంగళా బ్రిటిష్ కాలం నాటి నుండి నాగ హిల్స్ జిల్లా ప్రధాన పాలకుని నివాసం. నాగా ల్యాండ్ స్టేట్ ఏర్పడే వరకూ ఈ భవనం అట్లే కలదు. ఈ భవన నిర్మాణంలో బ్రిటిష్ మరియు నాగ శిల్పశైలి కనపడుతుంది. ఇది కొహిమ యుద్ధ స్మశానం కు సమీపంలో సిటీ నడిబొడ్డున కలదు. అందమైన గార్డెన్ లు ఈ బంగాళా అందాన్ని మరింత పెంచాయి.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ భవనం రక్త సిక్తమై పూర్తిగా నష్ట పోయింది. అయితే యుద్ధ తదనంతరం మరో మారు దీనిని పునర్మించారు. ఇక్కడ జరిగిన యుద్ధం ఆగ్నేయ ఆసియ లోని ఒక ప్రసిద్ధ ఘట్టంగా మిగిలి పోయింది. సుమారు పదివేల మంది మిత్ర కూటమి మరియు జపాన్ సైనికులు యుద్ధంలో ఇక్కడ తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు.



Click it and Unblock the Notifications