సన్ టెంపుల్ సముదాయం లో ఉన్న మరొక అందమైన ఆలయం వైష్ణవ ఆలయం. ప్రకృతి వైపరీత్యాలని తట్టుకుని నిలబడిన రెండు ఆలయాలలో ఒకటి ఇది. కాని వైష్ణవ ఆలయం యొక్క ప్రధాన నిర్మాణం మాత్రం ఇక్కడ లేదు. 1956 లో అది కనుగొనబడినది.
ఈ ఆలయం పెద్ద ఇటుకలతో నిర్మించబడినది. సున్నం మరియు ఇసుకతో ప్లాస్టర్ చెయ్యబడినది. ఈ ఆలయం లో గుర్రాలు, ఏనుగులు వంటి వివిధ జంతువుల చిత్రాలు ఉన్నాయి. దేవుళ్ళు మరియు మనుషుల యొక్క చెక్కడాలు ఎక్కువ సంఖ్యలో ఈ ఆలయం లో గమనించవచ్చు. వైష్ణవ ఆలయం పై నున్న చెక్కడాలు జీవితం యొక్క వేడుకలను ప్రతిబింబిస్తాయి. సన్ టెంపుల్ ని సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు తప్పక సందర్శించే ప్రదేశం ఇది.