కూకనూర్ లో మధ్య యుగం నాటి భవనాలు ఎన్నో ఉన్నాయి. ఇపుడు అవి చాలావరకు శిధిలమై కనపడతాయి. ఎన్నో పురాతన దేవాలయాలు కలవు. వాటిలో నవలింగ, కళ్ళేశ్వర, మల్లిఖార్జున, మహామాయ దేవాలయాలు ప్రసిద్ధి. నవలింగ దేవాలయం 9 వ శతాబ్దం నాటిది. దీనిలో అనేక చారిత్రక శాసనాలున్నాయి. ఇక్కడ తొమ్మిది శివలింగాలు ఉంటాయి. ఇక్కడి మహామాయ దేవాలయం గురించి హిందువుల ఇతిహాసం మహా భారతంలో కూడా చెప్పబడింది. కూకనూరు కొప్పల్ పట్టణానికి 14 కి.మీ.ల దూరంలో ఉంది. కుష్టగి మరియు గంగావతి సమీప పట్టణాలు. ఈపట్టణాలనుండి కూకనూర్ కు బస్ సౌకర్యం కలదు. ఏడు మైళ్ళ దూరంలో ఉన్న బనికొప్పనుండి రైలు మార్గం కలదు.



Click it and Unblock the Notifications