చంబల్ నది ఒడ్డున వున్న అమర్ నివాస్ లో చంబల్ ఉద్యానవనం వుంది. అందమైన పరిసరాల్లో వున్న ఈ పెద్ద పార్కు ఒక చక్కటి విహార కేంద్రంగా కూడా ఉపయోగపడుతోంది. ఈ తోట మధ్యలో వున్న చెరువు లో కొన్ని మొసళ్ళు కూడా వున్నాయి. ఈ చెరువు మీద ఒక వేలాడే వంతెన కూడా నిర్మించారు.ఒకప్పుడు నది నిండా మొసళ్ళు ఉండేవి. 20వ శతాబ్దం మధ్యలో చాల మొసళ్ళను వేటాడేశారు. వాటిలో బతికిన కొన్ని ఇక్కడ కనబడతాయి. సన్నని ముట్టే తో వుండే ఘరియల్ అనే ఒక రకం మొసలి ని ఇక్కడ చూడవచ్చు.



Click it and Unblock the Notifications