విజింజం మంచినీటి ఎక్వేరియం పిల్లలకు, పెద్దలకు ఒకేలా ఆనందాన్ని ఇస్తుంది. తిరువంతపురంలో ఉన్న ఈ ఎక్వేరియం లో అద్భుతమైన జలచరాల సంకలనం ఉంది. ఇమేజ్ ముత్యపు ఉత్పాదన ప్రక్రియకు ఈ ఎక్వేరియం ప్రసిద్ది. ఈ ప్రక్రియలో షెల్ సిమెంట్ నించి తయారైన మూసను ముత్యపు చిప్పలోకి ప్రవేశ పెడతారు. కొద్దినెలల్లో ముత్యం ఈ మూసం ఆకారంలో రూపు దిద్దుకుని ముత్యపు చిప్ప నుండి బయటపడుతుంది. పిల్లలతో వెళుతుంటే ఈ ఎక్వేరియం ను తప్పక చూడాల్సిందే. మూన్ రాస్ లు, ఎండ్రాకాయలు, క్లౌన్ ఫిష్, లయన్ ఫిష్, పెద్ద తాబేళ్లు, ట్రిగ్గర్ ఫిష్, సర్జన్ ఫిష్, స్క్విరల్ ఫిష్, బటర్ఫ్లై ఫిష్, సొరచేపలు, పిరాన్హాలతో సహా అద్భుతమైన జలచరాల అన్నింటినీ మీరు ఒకేచోట చూడవచ్చు. కేంద్రీయ మంచినీటి చేపల పరిశోధనా సంస్థ లేదా సి ఎం ఎఫ్ ఆర్ ఐ ఈ ఎక్వేరియాన్ని అద్భుతంగా నిర్వహిస్తోంది. వారంలో అన్ని రోజులపాటు ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఎక్వేరియం తెరిచే ఉంటుంది.



Click it and Unblock the Notifications