Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మధ్య ప్రదేశ్

 

మధ్య ప్రదేశ్ పర్యాటకం – ఒక మనోహరమైన కలలరాజ్యం !!

‘భారత దేశం హృదయం’ గా పిలువబడే మధ్య ప్రదేశ్ దేశంలోని రెండో అతి పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్ర చరిత్ర, దాని భౌగోళిక స్థానం, ప్రాకృతిక అందం, సాంస్కృతిక వారసత్వ౦, ప్రజలు ఈ రాష్ట్రాన్ని దేశంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాయి. రాజధాని భోపాల్ ‘సరస్సుల నగరం’గా ప్రసిద్ది పొందింది. పర్యాటకులు ఆస్వాదించేలా అన్ని రకాల పర్యాటక అవకాశాలను మధ్య ప్రదేశ్ పర్యాటకం అందిస్తోంది. బాంధవ్ ఘర్ జాతీయ పార్కులో పులులను చూడడం దగ్గర నుంచి ఖజురహో లాంటి దేవాలయాల్లో నిర్మాణాల వరకు నిజమైన భారత దేశాన్ని పర్యాటకులు కనుగొంటారు.మధ్య ప్రదేశ్ భౌగోళిక స్వరూపం దేశం మధ్యలో వున్న ఈ రాష్ట్రంలోని ప్రకృతి వైవిధ్యం దీన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా నిలబెడుతుంది.

ఎత్తైన పర్వత శ్రేణులు, దట్టమైన పచ్చటి అరణ్యాలు, నదులు సరస్సుల తో ప్రకృతి లోని వివిధ అంశాల మధ్య సమన్వయము కనపడుతుంది. వింధ్యా, సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నర్మదా, తపతి నదులు సమాంతరంగా ప్రవహిస్తూ వుంటాయి. ఇక్కడి వైవిధ్య భరితమైన వృక్ష, జంతు జాతులు, ప్రాకృతిక అందం మధ్య ప్రదేశ్ పర్యాటకానికి తలమానికంగా నిలుస్తాయి.మధ్య ప్రదేశ్ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం వివిధ వంశాలకు చెందినా ఎంతో మంది రాజుల పాలన చూసింది మధ్య ప్రదేశ్. ప్రాచీన కాలం లో మౌర్యులు, రాష్ట్రకూటులు, గుప్తుల నుంచి ఇటీవలి బుందేలా, హోల్కర్, ముఘలాయి, సింధియాల పాలన వరకు దాదాపు పద్నాలుగు రాజవంశాల ఉత్థాన పటణాలకు ఇది సాక్షి.

వివిధ రాజుల పాలన వల్ల రకరకాల కళా, నిర్మాణ శైలులు కూడా వచ్చాయి.ఖజురహో లోని శృంగార శిల్పాలు, రాజసం వుట్టి పడే గ్వాలియర్ కోట, ఉజ్జయిని లోని దేవాలయాలు, ఒర్చ్చా లోని చిత్రకూట్ లేదా చట్ట్రిస్ – అన్నీ అద్భుత నిర్మాణాలకు ప్రతీకలే. ఖజురహో, సంచి, భీమ్ బెట్కా లను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రాలుగా ప్రకటించింది. మధ్య ప్రదేశ్ లోని గిరిజన సంస్కృతి ఇక్కడి పర్యాటకంలో ప్రధాన భాగం. గోండ్ లు, భిల్లులు, ఇక్కడ నివసించే ప్రధాన జాతులు. గిరిజన హస్త కళాకృతులు ఇక్కడి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఇక్కడి జానపద సంగీతం, నృత్యం దేశ కళా వారసత్వానికి పట్టుగొమ్మలు.

వన్య ప్రాణులు – మధ్య ప్రదేశ్ లో ప్రేరణ కలిగించే అంశం.వింధ్య, సాత్పురా పర్వతాలు, పచ్చటి అడవులు చాలా జీవజాతులకు ఆలవాలం. వన్య ప్రాణి అభయారణ్యాలు, వన్యప్రాణి జాతీయ పార్కులు కూడా మధ్య ప్రదేశ్ పర్యాటకం లోని ప్రధాన ఆకర్షణలు. బాంధవ్ ఘర్ జాతీయ పార్కు, పెంచ్ జాతీయ పార్కు, వన్ విహార్ జాతీయ పార్కు, కాన్హా జాతీయ పార్కు, సాత్పురా జాతీయ పార్కు, మాధవ్ జాతీయ పార్కు, పన్నా జాతీయ పార్కు మధ్య ప్రదేశ్ లోని కొన్ని సుప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు. ఈ కేంద్రాల్లో చాలా జాతులకు చెందిన పక్షులు, జంతువులూ, మొక్కలూ చూడవచ్చు. నీముచ్ లోని గాంధీ సాగర్ అభయారణ్యం కూడా వన్యప్రాణి నిలయమే.

ఈనాడు మధ్య ప్రదేశ్ ఒక సుప్రసిద్ధ పర్యావరణ పర్యాటక కేంద్రం.మధ్య ప్రదేశ్ లోని ఆహారం, పండుగలు పబ్బాలుమధ్య ప్రదేశ్ లోని విభిన్న వంటకాలు మధ్య ప్రదేశ్ పర్యాటకానికి కీలకమైన భాగం. ఆహారంలో ప్రధానం గా రాజస్థానీ, గుజరాతీ వంటకాలు వుంటాయి. సీఖ్, షాహీ కబాబ్ లాంటి రాచరికపు వంటకాలు రాజధాని భోపాల్ ప్రసిద్ది. జిలేబీ, జీడిపప్పు బర్ఫీ లైతే మధ్య ప్రదేశ్ లోని అన్ని నగరాల్లో ప్రతి మిఠాయి దుకాణంలోనూ దొరుకుతాయి. అయితే రాష్ట్రంలోని వివిధ భాగాలలో ఆహారపు అలవాట్లలో తేడా వుంది. ఖజురహో లోని ఖజురహో నృత్యోత్సవం, గ్వాలియర్ లో జరిగే తాన్సేన్ సంగీత ఉత్సవం ప్రపంచ ప్రసిద్ది పొందాయి. మడాయి పండుగ, భాగోరియా పండుగ గిరిజన తెగలు జరుపుకునే సుప్రసిద్ధ గిరిజన పండుగలు.

 

మధ్య ప్రదేశ్ ప్రదేశములు

  • పాచ్ మారి 27
  • ఉజ్జయిని 22
  • పాచ్ మారి 27
  • భాంధవ్ ఘర్ 16
  • ఓర్చా 23
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Jun,Mon
Return On
09 Jun,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Jun,Mon
Check Out
09 Jun,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Jun,Mon
Return On
09 Jun,Tue