మహోబ నుండి 31 కిలో మీటర్ల దూరం లో, బాండా నగరం నుండి ఒక సుమారుగా ఒక కిలోమీటరు దూరం లో ఉత్తర ప్రదేశ్ లోని మహోబా జిల్లాలో గోఖర్ పర్వత్ లేదా గోఖర్ హిల్ ఉంది. ఈ ప్రాంతం లో ప్రసిద్దమైన పర్యాటక ఆకర్షణ ఇది.
అద్భుతమైన గ్రానైట్ రాళ్ల ఆకృతులు, అందమైన జలపాతాలు, ఒకప్పుడు గురు గోరఖ్నాథ్ మరియు అతని శిష్యులకి నివాసమైన అద్భుతమైన గుహలు ఈ పర్వతం పై మనకి కనిపిస్తాయి. గోఖర్ పర్వత్ కి సమీపం లో నే అతి ప్రసిద్దమైన కక్రమథ్ ఆలయం నెలకొని ఉంది. హిందూ మతం లో ని నాథ్ సంఘం యొక్క భక్తులని ఈ ఆలయం అధికం గా ఆకర్షిస్తుంది.
పిక్నిక్ ల కి వచ్చే వాళ్ళని అలాగే పర్వతారోహణ అంటే ఇష్టపడే వాళ్ళని ఈ పర్వతం ఎక్కువగా ఆకర్షిస్తుంది. హిందువుల, జైనుల అలాగే బౌద్ధుల మందిరాలు ఎన్నో ఈ పర్వతం పై ఉన్నాయి. బారి చంద్రికా దేవి ఆలయం, కతేస్వర్ మరియు రామ్ కుర్ద్ లో ఉన్న సూరజ్ కుర్ద్ మరియు శివ టెంపుల్ లు ఇక్కడ ఉన్న ముఖ్యమైన పర్యటక ఆకర్షణలు.
బీటెల్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ ఏర్పాటైన మరొక పర్యాటక ఆకర్షణ. లక్నో లో ఉన్న NBRI కి మరొక శాఖ ఇది. చట్టర్పూర్ రోడ్ లో ఉంది.



Click it and Unblock the Notifications