మాపూసా ఉత్తర గోవాలో ఒక పట్టణం. ఇది బాగా, కాలాన్ గూటే మరియు అంజునా బీచ్ ల సమీపంలో కలదు. ఇది పాణాజిం నుండి 13 కి.మీ.ల దూరంలో ఉండి పర్యాటకులకు తక్కువ ధరలలో బస ఏర్పాట్లకు అవకాశం ఇస్తుంది. ప్రత్యేకించి అక్టోబర్ నుండి డిసెంబర్ సీజన్ లో గోవా చేరే పర్యాటకులకు ఈ ప్రాంతం అనువైనది.
ఇక్కడ శుక్రవారం మార్కెట్ కొనుగోళ్ళకు ప్రసిద్ధి. చుట్టుపట్ల గ్రామాలు, పట్టణాలనుండి అమ్మకందార్లు తాము తయారు చేసిన చేతి కళల వస్తువులను, వ్యవసాయ ఉత్పత్తులను, తాజా పండ్లను మరియు సాంప్రదాయ ఆభరణాలను తెచ్చి ఇక్కడ అమ్ముతారు. మాపూసా ప్రాంతం వివిధ రకాల సముద్రపు ఆహారాలకు కూడా పేరు గాంచింది. మాపూసా నుండి పాణజిం కు మరియు గోవాలోని ఇతర ప్రాంతాలకు ప్రతి రోజూ బస్సులు కలవు. క్యాబ్ లు కూడా అందుబాటులోనే ఉంటాయి. అయితే, పర్యాటకులనేటప్పటికి అధిక ఛార్జీలు వసూలు చేస్తారు కనుక జాగ్రత్తగా ఉండండి.



Click it and Unblock the Notifications