మహారాష్ట్రలో మురుద్ బీచ్ ప్రసిద్ధి గాంచినది. ఇది మురుద్ జంజీరా గ్రామం వద్ద కలదు. సుమారు 1.75 కి.మీ.ల పొడవున ఇది వ్యాపించి ఒక కంఠ హారం వలే ఉంటుంది. బీచ్ పొడవునా తెల్లటి ఇసుక మరియు స్వచ్ఛమైన నీరు పర్యాటకులకు, స్ధానికులకు ఆనందం కలిగిస్తాయి.
ఇక్కడి వాతావరణం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. చల్లని సముద్రపు నీటి గాలులు మీ ఇంద్రియాలను ఆహ్లాదపరుస్తాయి. సోమరిగా కూర్చొని, పూర్తి విశ్రాంతి పొందాలనుకునే వారికి ఇది చక్కని ప్రదేశం. ఈ బీచ్ సందర్శకులకు మరచిపోలేని అనుభవాలను అందిస్తుంది.



Click it and Unblock the Notifications