మురుడేశ్వర్ లో మురుడేశ్వర్ బీచ్ ప్రసిద్ధమైనది. దీనికి చుట్టుపక్కల అరేబియన్ మహా సముద్రం మరియు కొండలు ఉంటాయి. ఇతిహాసాల మేరకు రావణుడు శివుని ప్రాణ లింగాన్ని విసరటంచే మురుడేశ్వర్ లోని నీరు పవిత్రమైనదని భావిస్తారు. బీచ్ ప్రాంతం నుండే ఎత్తుగా కొండపై ఉన్న అందమైన మురుడేశ్వర్ దేవాలయాన్ని చూడవచ్చు. ఇక్కడ దేవాలయంలో ఎంతో సుందరమైన విగ్రహాలు, శిల్పాలు పర్యాటకులకు, భక్తులకు ఆకర్షణగా నిలుస్తాయి.
ఈ ప్రాంతంలో జరిగే, పురాతన కాలంనుండి సాగుతున్న సాంప్రదాయ వినోదాలైన ఎడ్ల పందేలు వంటివి కూడా పర్యాటకులు చూసి ఆనందించవచ్చు. పర్యాటకులు దేవాలయంలోని పొడవైన అతిపెద్ద శివ విగ్రహాన్ని బీచ్ నుండే చూడవచ్చు. పర్యాటకులు అనేక నీటి సంబంధిత వినోదాలు అంటే, ఫిషింగ్, బోట్ విహారం, స్విమ్మింగ్ వంటివి చేయవచ్చు. బీచ్ లో సన్ బాత్ కూడా చేయవచ్చు. సంవత్సరంలో ఎపుడైనా సరే సమయం దొరికితే టూరిస్టులు వచ్చి ఇక్కడ ఆనందించవచ్చు. ఎంతోమంది విదేశీ యాత్రికులు ఈ బీచ్ లో అధిక సమయం గడుపుతూ ఆనందిస్తారు.



Click it and Unblock the Notifications