Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ముస్సూరీ

ముస్సూరీ - 'క్వీన్ ఆఫ్ హిల్స్'

65

ముస్సూరీ ని సాధారణంగా 'క్వీన్ ఆఫ్ హిల్స్' అని పిలుస్తారు.ఈ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో కలదు. ఇది గొప్పవైన హిమాలయాల కిందిభాగం లో సముద్ర మట్టానికి సుమారు 1880 మీటర్ల ఎత్తున కలదు. ఈప్రదేశం అక్కడ కల శివాలిక్ పర్వత శ్రేణుల సుందర దృశ్యాలకు మరియు దూన్ వాలీ కి ప్రసిద్ధి గాంచినది.

మత పర ప్రదేశాలైన యమునోత్రి మరియు గంగోత్రి లకు ముస్సూరీ ఒక గేటు వే గా కూడా చెప్పబడుతోంది. ముస్సూరీ అనే పేరు 'మాన్సూర్ ' అనే ఒక ఔషధ మూలిక నుండి ఏర్పడింది. ఈ ఔషధ మొక్క ఇక్కడ పుష్కలంగా లభిస్తుంది. ఇక్కడ కల సాధారణ ప్రజలు సాధారణంగా ఈ ప్రదేశాన్ని 'మాన్సూరి' అని అంటారు.

అందమైన ప్రదేశాల తో కూడిన ఈ పట్టణం లో అనేక ప్రాచీన టెంపుల్స్, కొండలు, జలపాతాలు, వాలీ లు, వైల్డ్ లైఫ్ సంక్చురి లు మరియు విద్యా సంస్థలు కలవు. జ్వాలా దేవి టెంపుల్, నాగ దేవత టెంపుల్ మరియు భాద్రాజ్ టెంపుల్ వంటివి ముస్సూరీ లో కొన్ని ప్రసిద్ధి చెందినా మతపర ప్రదేశాలు. జ్వాలా దేవి టెంపుల్ లో కల దేవత హిందువుల దేవత దుర్గ అవతారం. సముద్ర మట్టానికి సుమారు 2100 మీటర్ల ఎత్తున కల ఈ టెంపుల్ హిందువులకు ఎంతో ప్రాధాన్యత కలది.

ఇక్కడి దేవత టెంపుల్ లోని రాతి తో చేయబడినది. ఇక్కడే కల మరొక ఆకర్షణ నాగ దేవత టెంపుల్. ఈ టెంపుల్ సర్ప రాజు నాగ దేవత కు చెందినది. భక్తులు ఈ టెంపుల్ నినాగుల పండుగ అయిన నాగ పంచమి నాడు అధిక సంఖ్యా లో దర్శిస్తారు. ఈప్రదేశం దాని అందమైన కొండలకు ప్రసిద్ధి. అవి గన్ హిల్, లాల్ తిబ్బ,మరియు నాగ తిబ్బా లు. గన్ హిల్ సముద్ర మట్టానికి 2122 మీటర్ల ఎత్తున కలదు. ముస్సూరీ లో రెండవ అత్యధిక ఎత్తు కల ఈ కొండకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలదు.

స్వాతంత్రం రాక ముందు, ఈ హిల్ స్టేషన్ నుండి ఒక ఫిరంగిని ప్రతి రోజూ మధ్యాహ్నం వేళ స్థానికులకు సమయం తెలిపేందుకు పేల్చే వారు. అపుడు అక్కడి నివాసితులు వారి గడియారాలు లో సమయం సరి చేసుకునే వారు. ప్రస్తుతం, ఈ కొండ పై ముస్సూరీ నీటి అవసరాలు తీర్చే నీటి రిజర్వాయర్ నిర్మించారు. గన్ హిల్ కు గల రోప్ వే ప్రయాణం టూరిస్టులకు ఒక ఆసక్తి. ముస్సూరీ లో లాల్ తిబ్బ అత్యధిక ఎత్తు కలది. దీనిని అక్కడ ఒక డిపో వున్నా కారణం గా డిపో హిల్ అంటారు. ఆకాశవాణి కేంద్రం మరియు దూరదర్శన్ ల టవర్లు ఇక్కడ పెట్టారు. ఈ కొండపై ఇండియన్ మిలిటరీ సర్వీసెస్ కూడా అక్కడ నివాసం వుంటాయి. 1967 లో ఈ కొండపై ఒక జపాన్ దేశపు టెలీస్కోప్ ఏర్పరచారు. దీని ద్వారా టూరిస్టులు సమీప ప్రదేశాలను, అంటే బందేర్పంచ్, కేదార్నాథ్, మద్రీనాత్ వంటి వాటిని చూడవచ్చు. ముస్సూరీ లో నాగ తిబ్బ మరొక ప్రసిద్ధ హిల్. దీనిపై ఒక సర్ప శిఖరం కలదు. పర్యాటకులు ఇక్కడ అనేక సాహస క్రీడలు ఆచరించ వచ్చు. ఈ ప్రదేశం లో కేమ్ప్తి అనే అందమైన జలపాతాలు కలవు. ఝారి పాణి ఫాల్స్, భట్టా ఫాల్స్ మరియు మోస్సి ఫాల్స్ కూడా ప్రసిద్ధి. కెంప్ టి ఫాల్స్ సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తున కలవు.

ముస్సూరీ సందర్శకులు ఈ వాటర్ ఫాల్స్ తప్పక చూసి ఆనందిస్తారు. ఈ ప్రదేశ అందాలకు ముగ్ధుడైన జాన్ మెకినాన్ అనే బ్రిటిష్ ఆఫీసర్ దీనిని ఒక పర్యాటక ఆకర్షణ గా చేసాడు. ఝారిపాని ఫాల్స్ కూడా పర్యాటకులలో ప్రసిద్ధి గంచినవే. ఝారి పాణి గ్రామంలో కల ఈ జలపాతాలు సాహస ప్రియులకు ఒక గొప్ప ఆకర్షణ.భట్ట ఫాల్స్ మరియు మోస్సి ఫాల్స్ రెండూ ముస్సూరీ నుండి 7 కి. మీ. ల దూరం కలిగి వుంటాయి.

అందమైన పర్యాటక ప్రదేశమే కాక ముస్సూరీ విద్యా సంస్థలకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ అనేక యురోపెయన్ స్కూల్స్ వలస కాలం నాటివి కలవు. ఈప్రదేశం కొన్ని ఉత్తమ మరియు పురాతన బోర్డింగ్ స్కూల్స్ కలిగి వుంది. వాటిలో సెయింట్ జార్జ్,ఓక్ గ్రోవ్, వైన్ బెర్గ్ అల్లెన్ ప్రసిద్ధిచెందినవి. ఈ హిల్ స్తతిఒన్లొ ట్రెక్కింగ్ ఒక ప్రాధాన సాహస క్రీడా. ప్రకృతి నడకలు నడవటానికి ప్రసిద్ధి చెందినా కాలి బాటలు కూడా కలవు. ముస్సూరీ దేశం లోని ఇతర భాగాలకు వాయు, రైలు, రోడ్ మార్గాలలో కలుపబడి వుంది. ఈప్రదేశానికి సమీప విమానాశ్రయం దేహ్రాదూన్లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ . ఇది ముస్సూరీ కి సుమారు 60 కి. మీ. ల దూరంలో వుంటుంది. ఈప్రదేశానికి దేహ్రాదూన్రైల్వాయ్ స్టేషన్ సమీప రైలు స్టేషన్. ముస్సూరీ లో వాతావరణం అన్నికాలాల లోను ఆహ్లాదకరంగా వుంది ప్రతి సంవత్సరం అధిక సంఖ్యా లో పర్యాటకులను ఆకర్షిస్తుంది. అయితే, ముస్సూరీ సందర్శనకు మార్చనుంది జూన్ మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకూ మంచి సమయం గా చెప్పవచ్చు.

ముస్సూరీ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ముస్సూరీ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ముస్సూరీ

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ముస్సూరీ

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం ముస్సూరీ కి అనేక రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సు లు డెహ్రాడూన్ మరియు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి నడుస్తాయి. నైనిటాల్, న్యూ ఢిల్లీ వంటి పట్టణాల నుండి ప్రైవేటు డీలక్స్ బస్సు లు కూడా కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ ప్రయాణం 60 కి. మీ. ల దూరంలో కల డెహ్రాడూన్ రైలు స్టేషన్ ముస్సూరీ కి సమీప రైలు స్టేషన్. ఈ రైల్వే జంక్షన్ నుండి దేశం లోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి ముస్సూరీ కి పర్యాటకులు టాక్సీ ల లో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం 60 కి. మీ. ల దూరం లో గల డెహ్రాడూన్ లో గల జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ ముస్సూరీ కి సమీప ఎయిర్పోర్ట్ . ఈ ఎయిర్పోర్ట్ న్యూ దేల్హిలోని ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు తరచు విమానాలు కలిగి వుంది. ఈ ఎయిర్పోర్ట్ నుండి పర్యాటకులు టాక్సీ లలో ముస్సూరీ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu