Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ముజాఫర్ నగర్

ముజాఫర్ నగర్ - నోఇడా అడుగుజాడలలో !

23

ఆధ్యాత్మిక కేంద్రాలకి అలాగే ఆలయాలకి ప్రసిద్ది అయిన ముజఫర్ నగర్ ఉత్తర ప్రదేశ్ లో ఉంది. సయ్యద్ జాగిర్దార్ చేత మొఘలుల కాలంలో నిర్మించబడిన ఈ నగరం, అతని తండ్రి అయిన ముజాఫ్ఫార్ అలీ ఖాన్ పేరుతో ప్రసిద్ది చెందింది. వ్యూహాత్మకంగా ఢిల్లీ నుండి డెహ్రాడున్ కి అనుసంధానమయ్యే జాతీయ రహదారి పై నెలకొని ఉన్న ఈ నగరం నోయిడా యొక్క అడుగుజాడలలో వేగంగా అభివృద్ధి చెందుతోంది.

చరిత్ర ఈ ప్రాంతం మొట్ట మొదటి ఆధారం హరప్పాన్ నాగరికతకి చెందినది. మహాభారతంలో కూడా ఈ నగరం యొక్క ప్రస్తావన ఉంది. 'పచెండ' అనబడే గ్రామం లో మహాభారత యుద్ధం సంభవించిందని అంటారు. ప్రస్తుతం 'కౌరవాలి' (కౌరవుల శిబిరం) మరియు 'పాండవ్లి' (పాండవుల శిబిరం) గా ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతాల్లో ఇరువైపులకి చెందిన సైనిక దళాల శిబిరాలు ఉండేవని అంటారు. నిజానికి హస్తినాపూర్ మరియు కురుక్షేత్రకి సమీపంలో ముజఫర్ నగర్ ఉంది. ఈ రెండు ప్రాంతాలు మహా భారత యుద్దానికి సంబంధం కలిగిన ప్రాంతాలే. మొఘలుల పాలనలో సయ్యిద్ జాగిర్దార్ ఒక నగరాన్ని ఏర్పరచి తన తండ్రి పేరుని ఆ నగరానికి పెట్టినప్పటినుండి ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది.

నోయిడా మరియు మీరట్ లకి బలమైన పోటీ అందిస్తున్న ఈ నగరం ఎల్లప్పుడూ సందడిగా, రద్దీగా ఉంటుంది. రియల్ ఎస్టేట్స్ మరియు ఇతర పారిశ్రామిక రంగాల పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా ఈ నగరం నిలుస్తుంది. అత్యధికమంది భక్తులని ప్రత్యేకించి పర్వదినాలలో లక్షలాది భక్తులను ఆకర్షిస్తున్న భైరో టెంపుల్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన ఆకర్షణ.

ముజ్జాఫ్ఫార్ నగర్ లో సందర్శించవలసిన పర్యాటక ఆకర్షణలు

ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన ఆకర్షణ భైరో కా మందిర్. గణేష్ ధామ్, దుర్గా ధామ్, హనుమాన్ ధామ్ మరియు కాళి-నాడి మందిర్ లు ఈ ప్రాంతం లో ఉన్న ఇతర ఆలయాలు. ఈ ప్రాంతం నుండి కొన్ని మైళ్ళ దూరం లో ఉన్న శివ చౌక్ లో మరికొన్ని ప్రసిద్దమైన ఆలయాలు ఉన్నాయి. హిందువులచే పవిత్రమైనదిగా భావించబడే ప్రాచీనమైన అక్షయ వట వృక్షం ఈ ఆలయంలో ఉంది. ప్రఖ్యాత సూఫీ సెయింట్ సమాధి అయిన దర్గా హర శ్రీనాథ్ ఈ నగరంలో ఉంది. ప్రతి సాయంత్రం కీర్తనలు జరిగే సంకీర్తన భవన్ కూడా ఈ నగరంలో ఉంది.

ముజ్జాఫ్ఫార్ నగర్ కి సమీపంలో ఉన్న అందమైన గ్రామం వహేల్నా. ఇది వహేల్నా జైన్ మందిరం (శ్రీ 1008 పర్శ్వనాథ్ దిగంబెర్ జైన్ అతిశ్యే చెత్ర) కి స్థావరం. ఉత్తర భారత దేశంలోనే ఇది ప్రధానమైన పుణ్య క్షేత్రం.

ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు, వివిధ మ్యూజియంలకి అలాగే జూలజీ మ్యూజియం మరియు ప్రభుత్వ విజ్ఞాన మ్యూజియంల తో పాటు విద్యాసంస్థలకి ఈ ప్రాంతం ప్రసిద్ది. కమల నెహ్రు వాటిక లో నగరం లో గజి బిజీ నుండి దూరంగా ప్రశాంతమైన క్షణాలు పొందవచ్చు.

శుక మహర్షి పరీక్షిత్ మహారాజ్ కి ఏడు రోజుల పాటు భాగవత పురాణాన్ని వినిపించాడు. ఆ తరువాత అతని మరణం సంభవించింది. శుక్రతల్ అనే ప్రాంతం ఈ సంఘటనకి అనుసంధానమైనది.

 

 

ముజాఫర్ నగర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ముజాఫర్ నగర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ముజాఫర్ నగర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ముజాఫర్ నగర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ఢిల్లీ నుండి డెహ్రాడున్ ల మార్గంలో ఉన్న జాతీయ రహదారిపై ముజాఫ్ఫార్ నగరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ బస్సులు ప్రధాన నగరాలైన అలహాబాద్, మీరుట్, హరిద్వార్, ఉజ్జైన్ మరియు ఢిల్లీ వంటి ప్రదేశాలకి అనుసంధానమై ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ఢిల్లీ, జలంధర్, అమ్రిత్సర్, అలహాబాద్, డెహ్రాడున్, హరిద్వార్ మరియు ముంబై వంటి నగరాల నుండి ముజఫర్ నగరానికి తరచూ రైళ్ళు తిరుగుతూ ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం డెహ్రాడున్ లో ఉన్న జోలీ విమానాశ్రయం సమీపంలో ఉన్న విమానాశ్రయం. డెహ్రాడున్ నుండి టాక్సీ లేదా పబ్లిక్/ప్రైవేటు రవాణా బస్సుల ద్వారా ముజ్జాఫార్ నగర్ కి చేరుకోవచ్చు. ఢిల్లీ వైపు కి పయనించే బస్సులన్నీ ఈ నగరం మించే వెళతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu