హిమాచల్ ప్రదేశ్ లోని నహాన్ లో రేణుక టెంపుల్ ఒక మంచి పర్యాటక ప్రదేశం. ఈ దేవాలయంలో మాత రేణుక దేవి విగ్రహం వుంటుంది. ఇది రేణుక లేక్ పక్కన కలదు. పురాణాల మేరకు మాత రేణుక పరశురాముడి తల్లి. ఆమె తన స్వంత కుమారుని చే అతని తండ్రి సప్తర్షులలో ఒకడైన జమదగ్ని ఆదేశానుసారం వధించ బడుతుంది. మాత దుర్గ గౌరవార్ధం ఈ టెంపుల్ ను గూర్ఖాలు 19వ శతాబ్దం లో ఒకే రాత్రి లో నిర్మించారని చెపుతారు.
ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో మాత రేణుక గౌరవార్ధం రేణుక లేక్ ఒడ్డున రేణుక జాతర చేస్తారు. మతపర విస్వాసాలే కాక దీనిలో మంచి సంగీత నాట్య కళలు ప్రదర్శిస్తారు. స్ట్రీట్ మార్కెట్ లు, ఎక్సిబిషన్ లు ఇంకా అనేక ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఒక పురాతన సాంప్రదాయం మేరకు ప్రజలు వారి తల పాగాలను, టోపిలను ఒకరి తో మరి ఒకరు మార్చుకుంటారు. ఒకరి నీరు మరి ఒకరు తాగి సౌభ్రాత్రుత్త్వం చాటుకుంటారు.



Click it and Unblock the Notifications