Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నెల్లూరు

నెల్లూరు - అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం

21

నెల్లూరు నగరం ఆంధ్రప్రదేశ్  లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. రాష్ట్రం లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలోఒకటి. ఈ పట్టణం పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాకు రాజధాని కూడాను. అది వరలో ఈ జిల్లాను నెల్లూరు జిల్లా అని మాత్రమే పిలిచేవారు. ఈ పట్టణం వివిధ ప్రసిద్ధ దేవాలయాలు మరియు వ్యవసాయ పరంగా ఒక ప్రసిద్ధ కేంద్రంగా కూడా వుంది. నెల్లూరు నగరం పెన్నా నది ఒడ్డున కలదు. ఈ ప్రాంతం లో ఎన్నో రకాల పంటలు పండుతాయి.  ఈ నగరం విజయవాడ, తమిళనాడు రాజధాని అయిన  చెన్నై ల రహదారి లో వుండటం వలన  వ్యాపారం, వాణిజ్యంలకు సంబంధించి ఎంతో ప్రధానమైనది. నగరంలో మౌలిక వసతులు కూడా అభివృద్ధి చెందటం చేత, ఇది  ఒక మంచి నగరంగా తయారు అవుతోంది. నెల్లూరుని అనేక రాజ వంశాలు పాలించాయి. అన్నిటికంటే మొదటిది, మౌర్య వంశ పాలన. క్రీ. పూ. ౩ వ శతాబ్దం లో ఇది అశోకుడి సామ్రాజ్యంలో భాగంగా వుండేది. కాలక్రమేణా, ఇది పల్లవులు, తెలుగు చోళులు, శాతవాహనులు ఇంకా ఇతర రాజ వంశాలచే పాలించబడింది. ఈ రాజ వంశాల సంస్కృతి అంతా ఇక్కడి దేవాలయాలు ఇతర ప్రాచీన కట్టడాల శిల్ప శైలి లో కనపడుతుంది. వర్తక, వాణిజ్యాలకు, వ్యవసాయానికి కేంద్రం అవటం మాత్రమే  కాక, ఈ నగరం బ్రిటిష్ కాలం నాటి అనేక ప్రాచీన దేవాలయాలు, ఇతర కట్టడాలు  కూడా కలిగి వుంది.

ఈ నగరం  ఎలా ఏర్పడింది?

నెల్లూరు పట్టణం  బ్రిటిష్ పాలనలో చాల ప్రశాంతంగా వుండేది. ఆనాటి స్వాతంత్ర పోరాట ఉద్యమాల నుండి దూరంగా ఉండేది. ఇండియా కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ప్రధాన రాజకీయ కేంద్రంగా మారింది. అక్టోబర్ 1 వ తేది, 1953  వరకు ఇది మద్రాస్ రాష్ట్రం లో భాగంగా వుండేది. దీనిని 1 నవంబర్, 1956 నాడు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చేర్చారు.  రాష్ట్రావతరణలో ఈ ప్రదేశం విశేషమైన పాత్ర పోషించింది. తెలుగు వాడు, ప్రఖ్యాత దేశభక్తుడు పొట్టి శ్రీరాములు  చేసిన ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. కనుకనే ఈ జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లా అని నామకరణం చేసారు .  పట్టణం లోని ప్రధాన ఆకర్షణలు

నగరంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయం ప్రధాన ఆకర్షణ. నగర సరిహద్దుల్లోనే కల ఈ దేవాలయం సుమారు 600 ఏళ్ల  నాటిది. ఈ దేవాలయ  గోపురం సుమారు 70 అడుగుల ఎత్తులో వుంది. దీనిని గాలి గోపురం అంటారు. గాలిగోపురం పై భాగంలో ఏడు  బంగారు తాపడం కలశాలు వుంటాయి. ఇవి ఈ దేవాలయ ఐశ్వర్యాన్ని చాటి చెపుతాయి. నెల్లూరు లో ఇతర విహార ప్రదేశాలు అంటే మైపాడు బీచ్, పులికాట్ లేక్ కలవు. ఇది  వివిధ పక్షి జాతులు కల నేలపట్టు బర్డ్ సాన్క్చురి కి సమీపం. ఈ నగరంలో పురాతన దేవాలయాలు అనేకం కలవు. నగరం మధ్య నుండి సుమారు 13 కి. మీ. ల దూరంలో నరసింహస్వామి టెంపుల్ కలదు. నెల్లూరుకి సమీపం లోని సోమశిల ఒక పిక్నిక్ ప్రదేశం. ఎంతో ప్రశాంతంగా వుంటుంది. చుట్టుపక్కల అడవులు మాయం అవుతూండటంతో నా నాటికి నగర వాతావరణం వేడి అధికమై పోతోంది. మే నెలలో సుమారు 41 డిగ్రీలు గరిష్టంగా వుంటుంది. ఏప్రిల్, మే నెలలలో వేడి గాలులు వీస్తాయి. నెల్లూరు సందర్శనకు చలికాలం అనువైనది. ఈ ప్రదేశం చెన్నైకి సమీపం గా సుమారు 200 కి. మీ.ల దూరంలో కలదు. నెల్లూరుకు    హైదరాబాద్ నగరం సుమారు 450 కి. మీ. ల దూరంలో కలదు.

 

నెల్లూరు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నెల్లూరు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నెల్లూరు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నెల్లూరు

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం నెల్లూరు నగరం తమిళ నాడు రాజధాని అయిన చెన్నై నుండి నాలుగు రోడ్ల మార్గంలో కలుపబడింది. సుమారు రెండున్నర గంటల రోడ్డు ప్రయాణం మాత్రమే. కారులు, బసు లు తరచుగా తిరుగుతూంటాయి. హైదరాబాద్ లేదా వివిధ ఇతర ప్రదేశాల నుండి కూడా బస్సు లు తరచుగా లభ్యంగా వుంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం నెల్లూరు కు స్వంత రైలు స్టేషన్ కలదు. ఈ రైలు స్టేషన్ కు ప్రతి రోజూ దేశం లోని వివిధ ప్రాంతాలనుండి రైళ్ళు వస్తాయి. చెన్నై నుండి, నెల్లూరు కు ట్రైన్ లో మూడు గంటల సమయం మాత్రమే పడుతుంది. హైదరాబాద్ నుండి సుమారు 10 గంటల ప్రయాణం లో నెల్లూరు చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం నెల్లూరుకు చెన్నై లోని అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 177 కి. మీ. ల దూరం లో కలదు. విమానాశ్రయం నుండి నెల్లూరు కు టాక్సీ ల లో తేలికగా చేరవచ్చు. తిరుపతి లోని విమానాశ్రయం సుమారు 130 కి. మీ. ఐ. కలదు. ఈ విమానాశ్రయం నుండి, హైదరాబాద్, విశాఖపట్నం మరియు ఇతర నగరాలకు విమానాలు కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Sep,Sat
Return On
13 Sep,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Sep,Sat
Check Out
13 Sep,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Sep,Sat
Return On
13 Sep,Sun