వరల్డ్స్ ఆఫ్ వండర్ నోయిడా సెక్టర్ 18 లో ఉంది. ఆసియాలో కెల్ల అతి పెద్ద వినోదాత్మక పార్కు ఇది. దీనిని వ్యాపార దిగ్గజాలయిన ఇంటర్నెషనల్ రిక్రియేషన్ పార్క్స్ లిమిటెడ్ మరియు యూనీటెక్ లు సం యుక్తం గా నిర్మించాయి. ఈ కేంద్రం అన్ని వయసుల వారికీ వినోదాన్ని అందిస్తుంది.
ఈ పార్కుని రెండు విభాగాలుగా విభజించారు. మొదటిది "రోడ్ షో"పెద్ద వారి కోసం. ఇంకొకటి "లా ఫియెస్టా" కుటుంబాలు మరియు పిల్లలకోసం.
రోడ్ షో విభాగం సంగీతం,రైడ్స్ మరియు ఇతర రకాలుగా వినోదాన్నందిస్తుంది. దీనిలో గల రైడ్స్ లో కూర్చుని పైకి వెళ్ళే కొద్దీ తల తిరిగేంత ఎత్తుకి వెళ్తుంటాయి. అందువల్ల మీ అడ్రినలీన్ ఉత్సాహంతో ఉరకలెత్తడం ఖాయం.
లా ఫియెస్టా విభాగం 16187 చదరపు కీ.మీ. విస్తీర్ణంలో ఉండి 11 రైడ్స్ ఉన్నాయి.ఇంకా ఈ పార్కు లో రకరకాల తినుబండారాలు లభించడమే కాకుండా సందర్శకులు డ్యాన్స్,గేంస్ నుండి నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications