Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పాలంపూర్

పాలంపూర్ - ప్రకృతి దృశ్యాల పట్టణం!

26

అందమైన ప్రకృతి దృశ్యాలకు మరియు నిర్మలమైన వాతావరణానికి పేరు పొందిన ప్రాంతం, పాలంపూర్. ఇది కాంగ్రా లోయలో ఉన్న ఒక కొండ పట్టణం. పైన్ మరియు దేవదార్ చెట్ల దట్టమైన అడవులు, స్వచ్చమైన ప్రవాహాలతో ఈ ప్రాంతం చాలా సుందరంగా ఉంటుంది. ఈ ప్రాంతం, ఒక వాణిజ్య పర్యాటక స్థలంలా కాకుండా, స్వచ్ఛంగా, ఉల్లాసవంతంగా శెలవులు గడపటానికి చాలా బాగుంటుంది. ఇది సముద్ర మట్టానికి 1220 మీ. ఎత్తున ఉండి, ప్రకృతి ఆరాధకులకు ఒక వరంలా ఉన్నది. ఈ ప్రాంతం యొక్క పేరు హిమాచల్ భాషలో ఉన్న 'పులుం' అనే మాట నుండి ఏర్పడింది. 'పులుం' అంటే 'నీరు సమృద్ధిగా ఉండటం'.

బ్రిటిష్ వారు ఈ స్థలం యొక్క ఏటవాలు ప్రాంతాలలో టీ పొదలను పెంచాలని నిర్ణయించుకున్నప్పుడు, 19వ శతాబ్దంలో ఈ పట్టణం ఏర్పడింది. పాలంపూర్, ఈ విధంగా 'రాష్ట్రం యొక్క టీ కౌంటీ'గా కూడా చాల ప్రాచుర్యంలోకి వొచ్చింది. ఇక్కడనుండి అనేక రకాల బ్రాండ్ల టీ ఎగుమతులు జరుగుతుంటాయి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న పట్టణాలు, ఎగువన ఉన్న వరి పొలాలు,గుడులు, గ్రామాలు, వలస బంగళాలు మరియు మంచుతో కప్పబడిన ధాలుధర్ పర్వతాలు, ఇవి అన్నీ ఈ ప్రాంతాన్ని పర్యాటక స్వర్గంగా చేశాయి.

ఇక్కడ ఉష్ణోగ్రత మధ్యస్థంగా ఉంటుంది కనుక యాత్రికులు సంవత్సరమంతా ఎప్పుడైనా ఈ ప్రాంతాన్ని సందర్శించవొచ్చు. ఇక్కడ వేసవికాలంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 29 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండి, ఈ ప్రాంతాన్ని సందర్శించటానికి అనుకూలంగా ఉంటుంది. పాలంపూర్ లో వర్షాకాలంలో ఎక్కువ వర్షపాతం ఉంటుంది కాబట్టి యాత్రికులు దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. శీతాకాలం ఇక్కడ నవంబర్ నెల నుండి ప్రారంభమవుతుంది.ఈ సమయంలో,ఇక్కడ ఉష్ణోగ్రత -2 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పడిపోతుంది. మంచు కూడా పడుతుంటుంది.

పాలంపూర్ కు 40 కి. మీ. దూరంలో గగ్గల్, (దీనినే ధర్మశాల-కాంగ్రా విమానాశ్రయం అని కూడా అంటారు) ఉన్నది. ఈ విమానాశ్రయం పెద్ద నగరాలైన డిల్లి, ముంబై వంటి వాటికి నేరుగా అనుసంధించబడింది. ప్రయాణికులు రైల్ ద్వారా రావాలనుకుంటే, నారో గేజ్ ముఖ్యకేంద్రం, మరంద వరకు రావొచ్చు, పట్టణం సమీపంలో 120 km దూరంలో పఠాన్కోట్ బ్రాడ్ గేజ్ రైలు ముఖ్యకేంద్రం ఉంది. పాలంపూర్ కు రోడ్ మార్గం ద్వారా సులభంగా చేరుకోవొచ్చు. మండి, పఠాన్ కోట్ మరియు ధర్మశాల నుండి ప్రైవేటు మరియు రాష్ట్ర సొంత బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.

పాలంపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పాలంపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పాలంపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పాలంపూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ మార్గం ద్వారా: రోడ్ ద్వారా పాలంపూర్ కు సులభంగా చేరుకోవొచ్చు. ముఖ్య నగరాలైన మండి, ధర్మశాల మరియు పఠాన్ కోట్ నుండి ప్రైవేటు మరియు రాష్ట్ర రవాణా బస్సులు ఉన్నాయి. ఇక్కడకు చేరుకోవటానికి కి.మీ కు 2 రూ. చొప్పున బస్సు చార్జ్ అవుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైల్ ద్వారా: పాలంపూర్ కు దగ్గరగా 2 కి.మీ. దూరంలో ఉన్ననారో గేజ్ రైల్ ముఖ్యకేంద్రం మరంద వరకు రావొచ్చు. పాలంపూర్ కు దగ్గరలో 120 కి. మీ. దూరంలో బ్రాడ్ గేజ్ రైల్ ముఖ్యకేంద్రం పఠాన్ కోట్ ఉన్నది. ఈ రెండు రైల్వే స్టేషనులు ఇండియాలోని ముఖ్య నగరాలకు జత చేయబడి ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానం ద్వారా: పాలంపూర్ కు దగ్గరలో ధర్మశాల విమానాశ్రయం ఉన్నది. దీనినే గగ్గల్ అని కూడా అంటారు. ఇది పాలంపూర్ కు 40 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయం ముఖ్య నగరాలయిన డిల్లీ, ముంబై లకు అనుసంధించబడి ఉన్నది. ప్రయాణికులు గగ్గల్ నుండి పాలంపూర్ కు సులభంగా టాక్సీలో చేరుకోవొచ్చు. దీనికి 750 రూ. ఖర్చు అవుతుంది. విదేశీ ప్రయాణికులకు 508 కి.మీ. దూరంలో ఉన్న డిల్లీ నుండి పాలంపూర్ కు అనుసంధించబడి ఉన్న విమానాల ద్వారా చేరుకోవొచ్చు. డిల్లీ నుండి పాలంపూర్ కు 10,000 రూ. ఖర్చు అవుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 May,Sat
Return On
10 May,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 May,Sat
Check Out
10 May,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 May,Sat
Return On
10 May,Sun