Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పాటియాలా

పాటియాలా పర్యాటకం – హిందుస్తానీ శాస్త్రీయ సంగీతానికి పుట్టినిల్లు !!

13

ఆగ్నేయ పంజాబ్ లోని మూడో అతి పెద్ద నగరం పాటియాలా సముద్ర మట్టానికి 250 మీటర్ల ఎత్తున వుంది. సర్దార్ లఖ్నా, బాబా ఆలా సింగ్ నిర్మించిన ఈ నగరాన్ని మహారాజా నరేంద్ర సింగ్ (1845 – 1862) అభివృద్ది చేసారు. పాటియాలా జిల్లాకు పరిపాలనా కేంద్రంగా వున్న ఈ నగరంలో రాజ కోటలు, పది ద్వారాలు వున్నాయి.

ఇక్కడ విరివిగా మాట్లాడే పంజాబీ భాషతో పాటు హిందీ, ఆంగ్లం కూడా అధికారిక అవసరాలకు ఉపయోగిస్తారు. దీపావళి, హోలీ, దసరా, గురుపర్వ, బైసాఖీ ఈ నగరంలో ఘనంగా జరుపుకునే పండుగలు. ఇక్కడ మాత్రమే జరిగే ‘పాటియాలా వారసత్వ పండుగ’ పాటియాలా పర్యాటకం లో తప్పక చూడాల్సిన ఘట్టం. ప్రతి ఏటా ఫిబ్రవరిలో నిర్వహించే ఈ పండుగ సంగీత, కళా ప్రియులను దూర ప్రాంతాల నుంచి కూడా ఆకర్షిస్తుంది. ఇక్కడ పది రోజుల పాటు జరిగే చేతివృత్తుల మేళా చాలా పెద్ద ఆకర్షణ. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతానికి ఈ నగరాన్ని పుట్టినిల్లుగా ‘పాటియాలా ఘారానా’ అని పిలుస్తారు.

పాటియాలా లోను, చుట్టుపక్కాలా చూడదగ్గ ప్రదేశాలు

గొప్ప సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించే చాలా ప్రదేశాల వల్ల పాటియాలా పర్యాటకం చాలా ప్రసిద్ది పొందింది. కిలా ముబారక్ సముదాయం లాంటి చాలా కోటలు, ఉద్యానవనాలు, శీష్ మహల్, బారాదరి తోటలు, కిలా అంద్రూన్, రంగ మహల్, మాయిజీ దీ సరాయి, మాల్ రోడ్, దర్బార్ హాల్ వంటివి ఇక్కడ చాలా వున్నాయి. పాటియాలాకు సమీపంలో కూడా సమాన, బానూర్, సనౌర్ లాంటి చాలా పర్యాటక ఆకర్షణలు వున్నాయి.

పాటియాలా అందించే ముఖ్యమైన విషయాలు.

తలపాగా (పగరీ), పరాందా (జుట్టు ముడి వేసేందుకు ఉపయోగించే టాగ్ లాంటిది), పాటియాలా సల్వార్ (ఆడవారు ధరించే ఓ రకం ట్రౌసర్), జుట్టీ (ఓ రకం పాదరక్షలు) లేదా పాటియాలా పెగ్ (మద్యానికి ఒక కొలత) ఇవన్నీ పాటియాలా పర్యాటకాన్ని సుప్రసిద్ధం చేసాయి. పర్యాటకులు తమకోసం గానీ, తమ వారి కోసం గానీ వీటిని కొని తీసుకు వెళ్ళచ్చు. బడ్జెట్ హోటల్స్ నుంచి త్రీ స్టార్ హోటళ్ళ దాకా పర్యాటకులకు వివిధ రకాల హోటళ్ళు అందుబాటులో వున్నాయి.

పాటియాలా ఎలా చేరుకోవాలి

పాతియాలాకు బస్సు, రైలు, టాక్సీ లేదా విమానంలో చేరవచ్చు. ఈ నగరానికి చాలా బస్సులు, రైళ్ళు నడుస్తాయి కనుక పర్యాటకులు ఇక్కడికి తేలిగ్గా చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి ముంబై, చండీఘర్, డిల్లీ లాంటి ప్రధాన నగరాలకు నిత్యం రైళ్ళు తిరుగుతాయి. పాటియాలా నుంచి 60 కిలోమీటర్ల దూరంలో వున్న చండీఘర్ ఇక్కడికి సమీప విమానాశ్రయం.

పాటియాలా సందర్శనకు ఉత్తమ సమయం

వేసవి, వర్షాకాలం, శీతాకాలాలతో పాటియాలాలో ఉష్ణ మండల వాతావరణం వుంటుంది. అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శించవచ్చు. ఈ నెలల్లో నగరం లో చల్లటి గాలి వీస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం వుంటుంది.

పాటియాలా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పాటియాలా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పాటియాలా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పాటియాలా

  • రోడ్డు ప్రయాణం
    There is no route available in పాటియాలా
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ఈ నగరంలో వున్న రైల్వే స్టేషన్ నుంచి రాష్ట్రం, దేశంలోని వివిధ ప్రదేశాలకు రైళ్ళు తిరుగుతాయి. పర్యాటకులు ముంబై, చండీఘర్, డిల్లీ లాంటి నగరాలనుంచి రైలు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం పాటియాలాకు 60 కిలోమీటర్ల దూరంలో వున్న చండీఘర్ ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. విమానాశ్రయం నుంచి పాటియాలా చేరుకోవడానికి టాక్సీలు తేలిగ్గానే దొరుకుతాయి. ఇక్కడినుంచి డిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు లాంటి ప్రధాన నగరాలకు నిత్యం విమానాలు తిరుగుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Apr,Wed
Check Out
02 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu