Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పోఖ్ రాన్

పోఖ్ రాన్ - ఎడారిలో వారసత్వ నగరం

11

పోఖ్ రాన్ రాజస్ధాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ జిల్లాలో కల ధార్ ఎడారిలో ఒక వారసత్వ నగరం. దీని చుట్టూ అయిదు పెద్ద ఉప్పు కొండలు ఉంటాయి. అందుకే దీనిని అయిదు ఎండమావుల స్ధలంగా చెపుతారు. ఈ ప్రదేశం మొట్టమొదటి సారిగా భారతదేశం అనేక అణు పరీక్షలను ఇక్కడ చేయడంతో గుర్తింపులోకి వచ్చింది. మే 18, 1974 నాడు పోఖరాన్ ప్రదేశంలో భారత దేశపు మొదటి అణు పరీక్ష చేయబడింది. ఈ అణు పరీక్షకు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అంటే 'చిరునవ్వులో బుద్ధుడి చర్య ' అని పేరు పెట్టారు. ఈ ప్రదేశం అక్కడకల హవేలీలు, స్మారకాలు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశాలలో బాబా రామ్ దేవ్ దేవాలయం ఒకటి. ఇది పోఖరాన్ కు 12 కి.మీ.ల దూరంలో రామ్ దేవరా గ్రామంలో కలదు. దేవాలయం పరిసరాలలో, రామ్ దేవ్ జీ సమాధి కలదు. రాజస్ధానీయులు ఇతడిని దేవుడుగా భావిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే రామ్ దేవరా జాతరకు భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు వస్తారు.

ఈ ప్రదేశంలో మరొక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ పోఖరాన్ కోట, దీనినే బాలా ఘర్ అని కూడా పిలుస్తారు. దీనిని 14వ శతాబ్దంలో నిర్మించారు. ఇది చంపావత్ నాయకులకు చెందినది. అందమైన శిల్ప శైలి మరియు కోటకు కల సువర్ణ చరిత్ర పర్యాటకులను ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షిస్తుంది. ఈ కోటలో ఒక మ్యూజియం కూడా కలదు. దానిలో రాజపుత్రుల కాలానికి చెందిన అనేక వస్తువులు, ఆయుధాలు, కుండలు వంటివి ఉంటాయి.

ఈ పట్టణం ప్రసిద్ధి చెందిన అనేక అందమైన రాజ ప్రాసాదాలకు నిలయం. ఈ రాజ ప్రాసాదాలలో పర్యాటకులు తప్పక చూడదగినవి...సలీమ్ సింగ్ కి హవేలి, పట్వోం జీ కి హవేలి మరియు నాధ్ మల్ జి కి హవేలి.

టూరిస్టులు, విమానం, రైలు, రోడ్డు మార్గాలలో పొఖరాన్ తేలికగా చేరవచ్చు. జోధ్ పూర్ రైలు స్టేషన్ మరియు జోధ పూర్ విమానాశ్రయాలు పోఖరాన్ కు సమీప ప్రాంతాలు. పర్యాటకులు జైపూర్, జోధ్ పూర్, బికనీర్, జైసల్మేర్ వంటి నగరాలనుండి పోఖరాన్ బస్ లలో కూడా చేరవచ్చు.

ఈ ప్రదేశం ఏడాది అంతా ఒక తీవ్రమైన వాతావరణం అనుభూతిని కలిగిస్తుంది. ఆహ్లాదకరంగను మరియు అనుకూలమైన దిగాను ఉండే శీతాకాలంలో పర్యాటకులు తమ పర్యటన చేయడం సూచించదగినది.

 

పోఖ్ రాన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పోఖ్ రాన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పోఖ్ రాన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పోఖ్ రాన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం అన్ని ప్రధాన పట్టణాలనుండి అంటే జైపూర్, జోధ్ పూర్, బికనీర్, జైసల్మేర్ మొదలగు పట్టణాలనుండి పోఖ్ రాన్ కు రోజువారీ బస్సులు కలవు. మీకు గల బడ్జెట్ ను బట్టి ఎయిర్ కండిషనింగ్ బస్సులు కూడా లభ్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం పొఖ్ రాన్ కు రైలు స్టేషన్ కలదు. కొద్ది ట్రైన్ లు మాత్రమే ఆగుతాయి. జోధ్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంగా ఉంటుంది. జోధ్ పూర్ రైలు స్టేషన్ నుండి ఉదయపూర్, జైసల్మేర్, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ, అహ్మదాబాద్ లకు ప్రతిరోజూ రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి టాక్సీలలో పర్యాటకులు పొఖ్ రాన్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఉత్తమ పర్యటన ఎలా పర్యాటకులు పొఖ్ రాన్ కు వాయు, రైలు, రోడ్డు మార్గాలలో చేరవచ్చు. విమాన ప్రయాణం పొఖ్ రాన్ కు విమానాశ్రయం 172 కి.మీ.ల దూరంలో జోధ్ పూర్ లో కలదు. జోధ్ పూర్ విమానాశ్రయం నుండి ఉదయపూర్, ముంబై, న్యూఢిల్లీలకు రోజువారీ విమానాల సర్వీసులు కలవు. విమానాశ్రయం నుండి పొఖ్ రాన్ కు టాక్సీలు లేదా బస్ లలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jun,Tue
Return On
01 Jul,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jun,Tue
Check Out
01 Jul,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jun,Tue
Return On
01 Jul,Wed