(పులికాట్ సరస్సు వన్యప్రాణి అభయారణ్యంగా పిలువబడే) పులికాట్ పక్షి అభయారణ్యం ఈ తీరప్రాంత పట్టణం లోని ప్రధాన ఆకర్షణ. ఈ అభయారణ్యం సంరక్షణలో వున్న 481 చదరపు కిలోమీటర్ల ప్రాంతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ జిల్లాల్లో వుంది. ఒరిస్సాలోని ప్రసిద్ధ చిలకా సరస్సు తర్వాత రెండో అతి పెద్ద ఉప్పునీటి పర్యావరణ వ్యవస్థగా ఈ సరస్సు, అభయారణ్యం పేరుగాంచింది.
ఈ అభయారణ్యంలోని జీవవైవిధ్యం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది పర్యాటకులను, వన్యప్రాణి ప్రేమికులను ఇక్కడికి ఆకర్షిస్తుంది. ఇక్కడి పక్షులలో గ్రేటర్ ఫ్లెమింగో పక్షులు, పెలికాన్లు, సీగల్, ఎగ్రేట్, హెరాన్ లతో పాటు వివిధ జాతుల బాతులు, గద్దలు కూడా వున్నాయి. ఈ అభయారణ్యం వున్న ప్రాంతం తమిళనాడు, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల అటవీ శాఖల అధీనంలో వుంది.
ఈ అభయారణ్యం వలస పక్షులేన్నిటికో వసతి కల్పిస్తుంది, దీన్ని నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య సందర్శించాలి. పర్యాటక శాఖ ప్రతి ఏటా డిసెంబర్ జనవరి నెలల మధ్య నిర్వహించే ఫ్లెమింగో ఉత్సవం అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.



Click it and Unblock the Notifications