Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పుల్వామా

పుల్వామా - కాశ్మీర్ రైస్ బౌల్ !

14

పుల్వామా జమ్మూ & కాశ్మీర్ లో ఉన్న ఒక అందమైన జిల్లా. దీనిని 'కాశ్మీర్ రైస్ బౌల్' అని కూడా అంటారు.ఈ జిల్లాలో అవాన్తిపోర,షోపియన్, పుల్వామా, త్రాళ్,పంపోరే అనే 5 తాలుకాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 323 గ్రామాలు ఉన్నాయి. శ్రీనగర్ నుంచి 40 కిమీ దూరంలో ఉన్న పుల్వామాకు 1979 లో జిల్లా హోదా వచ్చింది. పుల్వామాను ప్రారంభములో పుల్గం అని తరువాత పంవంగం అనే పేరుతో పిలిచేవారు.

పుల్వామా జిల్లాను 1346 నుండి 1586 AD వరకు కాశ్మీర్ సుల్తానులు పాలించారు.16వ శతాబ్దంలో మొఘల్ పాలకులు పాలించారు,మరియు 19వ శతాబ్దపు ప్రారంభంలో ఆఫ్ఘన్లు ఈ ప్రాంతంలో పాలనను ప్రారంభించారు. పుల్వామా లో పర్యాటకులు సందర్శించటానికి అనేక మతపరమైన మరియు చారిత్రక కట్టడాలు ఉన్నాయి.

పర్యాటకులను ఆకర్షించటానికి అత్యంత ప్రసిద్ధి చెందిన చారిత్రక స్థలం మొఘల్ రోడ్ ఉంటుంది.ఆహార్బాల్ ఫాల్ ,శికర్గహ్,అరిపాల్ నాగ్,హుర్పోర,తర్సర్ మరియు మర్సర్ సరస్సులు మొదలైనవి జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు. పర్యాటకులకు కున్గ్వాత్తాన్ మరియు నగ్బెరాన్ లు కూడా ఆసక్తికరమైన ప్రదేశాలు.

పేయర్ ఆలయం, అవన్తిశ్వర్ ఆలయం, షా హందన్ ఆలయం మరియు సయ్యద్ హసన్ మన్తకుఇ మొదలైన పుణ్యక్షేత్రాలు ఈ జిల్లాలో ఉన్నాయి.అంతేకాకుండా, జమ మస్జిద్ షోపియన్ మరియు అసర్ షరీఫ్ పింజూర కూడా పుల్వామాలో ప్రముఖ మతపరమైన కేంద్రాలుగా ఉన్నాయి.

అన్ని ప్రధాన మార్గాల ద్వారా గమ్యాన్ని చేరటానికి రవాణా వ్యవస్థ ఉంది. ప్రముఖంగా శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ గా పిలువబడే షేక్ ఉల్ ఆలం విమానాశ్రయం, పుల్వామా సమీపంలోని ఎయిర్ బేస్ ఉంది. విమానాశ్రయం ముంబై, జమ్మూ, న్యూ ఢిల్లీ, మరియు బెంగుళూర్ వంటి పెద్ద నగరాలతో అనుసంధానించబడి ఉంది.అతి దగ్గరలో జమ్ము తావీ రైల్వే స్టేషన్ ఉంది.దీనికి భారతదేశం యొక్క అన్ని ప్రాంతాల నుంచి రైలు లింక్ ఉంది.

పుల్వామా దాని సహజ సౌందర్యం మరియు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండుట వల్ల పర్యాటకులను ఆకర్షిస్తుంది.ఈ ప్రాంతంలో వెచ్చని వేసవికాలం, శీతాకాలంలో చల్లని వాతావరణాన్ని అనుభవించవచ్చు. ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు పుల్వామా జిల్లాలోని ఆకర్షణలు సందర్శించటానికి అనువైన సమయం.

పుల్వామా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పుల్వామా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పుల్వామా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పుల్వామా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం పుల్వామాకు బస్సులు శ్రీనగర్ నుంచి అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు లేహ్ జమ్మూ, చండీగఢ్, పహల్గం మరియు ఢిల్లీ వంటి సమీపంలోని స్థలాలను చూడటానికి శ్రీనగర్ నుంచి బస్సులు ఉంటాయి,మరియు జమ్మూ & కాశ్మీర్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సేవలను తక్కువ ధరకు మరియు సౌకర్యవంతముగాను అందిస్తుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం జమ్ము తావీ రైల్వే స్టేషన్, పట్టణం నుండి 281 కిలోమీటర్ల దూరంలో పుల్వామాకు దగ్గరగా ఉన్నరైలు లింక్. ఈ రైల్వే స్టేషన్ బెంగుళూర్, ఢిల్లీ, త్రివేండ్రం మరియు చెన్నై వంటి భారతీయ నగరాలతో అనుసంధానించబడి ఉంది. పర్యాటకులకు జమ్మూ రైల్వే స్టేషన్ నుండి పుల్వామా వెళ్ళటం కొరకు టాక్సీలు ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    షేక్ ఉల్ ఆలం ఎయిర్ పోర్ట్ గా పిలువబడే శ్రీనగర్ విమానాశ్రయం, పుల్వామా దగ్గరగా ఉన్న ఎయిర్ బేస్. ఇది ఢిల్లీ, ముంబై, చండీగఢ్, మరియు సిమ్లా వంటి భారతదేశంలో ఉన్న ముఖ్యమైన నగరాలకు అనుసంధానించబడింది. యాత్రికులు పుల్వామా పట్టణంను చేరుకోవడానికి విమానాశ్రయం నుండి టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు. ఢిల్లీలో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీనగర్ కి 876 కి.మీ.ల దూరంలో ఉన్న సమీప అంతర్జాతీయ విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed