పుష్కర్ సరస్సు ఒడ్డున బ్రహ్మ దేవుని ఆలయం ఉంది. భారతదేశంలో బ్రహ్మ దేవుని కోసం నిర్మించిన అతి కొద్ది ఆలయాలలో ఇది ఒకటి. ఒక హిందూ జానపథ కథ ననుసరించి బ్రహ్మా దేవుడు పుష్కర్ వద్ద ఒక యజ్ఞం (అగ్నిని పూజించడం) నిర్వహిద్దామనుకొన్నాడు అయితే నియమిత సమయానికి యజ్ఞ్నాన్ని నిర్వహించడానికి అతని భార్య సావిత్రి అందుబాటులో లేకపోవడంతో . బ్రహ్మ దేవుడు యజ్ఞాన్ని నిర్వహించడానికి గాయత్రీ అనే స్థానిక గొల్ల పిల్లను వివాహం చేసుకోవలసి వచ్చింది. ఈ చర్య అతని భార్య సావిత్రికి కోపం తెప్పించింది. ఆమె బ్రహ్మ దేవుని పుష్కర్ లో తప్ప వేరొక ప్రాంతంలో పూజించరని శపించిందివాస్తవానికి ఈ దేవాలయం 14 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయంలో ఒక కమలంలో ఎడమవైపు తన చిన్న భార్య గాయత్రీ, కుడివైపు సావిత్రి తో బాటు కూర్చొని ఉన్న నాలుగు శిరస్సుల బ్రహ్మ దేవుని గొప్ప చిత్రం ఉంది.



Click it and Unblock the Notifications