ఉత్తర భారత దేశంలోని దాదాపు ప్రతి పట్టణం, నగరాలలో రాధాకృష్ణుల ఆలయం ఉండటం ప్రతి హిందువు హృదయంలో ఈ దివ్య జంటకు ఉన్న స్థానాన్ని తెలియజేస్తుంది. జాట్ల ప్రాబల్యం ఉన్న రోహటక్ జిల్లాలోని మహం నగరం కూడా దీనికి మినహాయింపు కాదు. పాత బస్ స్టాండుకు దగ్గరగా చింతల మొహల్లాలోని 6, 8 వార్డు నంబర్లలో ఉన్న ఒక అద్భుతమైన రాధాకృష్ణుల ఆలయానికి ఈ నగరం నివాసం.
ఇక్కడ గర్భగుడిలో ఉన్న శ్రీ కృష్ణుని విగ్రహాన్ని హిమాలయాలలో కేవలం కొన్న ప్రాంతాలలో మాత్రమే దొరికే నల్ల రాతిలో చేసారు. రాధా కృష్ణులు, తమ స్నేహితులతో పాటుగా వారు ఆడే హోలీ పండుగలో ఒకరి పట్ల ఒకరికి తమ ప్రేమను తెలుపుకోవడానికి ప్రత్యేకంగా పేరొందారు. ప్రతి ఏటా, ఈ ఆలయంలో హోలీ పండుగ ఎంతో విలాసంగా జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications