అరుణాచల ప్రదేశ్ లోని దిబంగ్ జిల్లాలో ప్రసిద్ధ విహారయాత్రా కేంద్రాలలో ఒకటి ఇఫిపని హార్బర్ సుందరదృశ్యాల అందమైన ప్రదేశం. రోయింగ్ టౌన్ షిప్ నుండి ఈ ప్రాంతం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. దిబంగ్ నదీ మైదాన లోయలో ఉన్న ఈ ప్రాంతంలో పర్యాటకులు విహార యాత్రతో ఆనందించవచ్చు. లోయ, నదులలోని మంత్రముగ్ధమైన దృశ్యాలు దేశ౦లోని అన్ని ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తాయి.
వారు తయారుచేసిన ఆహారాన్ని తెచ్చుకోవచ్చు లేదా నది ఒడ్డున రుచిగా ఉండే వంటల అనుభూతిని పొందవచ్చు. ఇది ప్రకృతి ప్రేమికులు కోరుకొనే కేంద్రం. ప్రజలు ప్రకృతి సంగీతంతో బాటుగా ఇక్కడి సంగీతాన్ని కూడా వినవచ్చు. నిర్మలమైన ఈ ప్రాంతంలో సన్నని రొద చేసే ఈ నది పరిసరాలు పట్టణ రణగొణధ్వనుల నుండి దూరంగా మనల్ని వేరే ప్రదేశానికి తీసుకొని వెళ్తాయి.
ఇఫిపని చుట్టూ విస్తరించి ఉన్న పచ్చదనం చల్లటి, తాజా గాలులకి ఆధారం. ఈ ప్రాంతానికి విహారయాత్రకు వచ్చే పర్యాటకులు తమ రోజును అనుభవించడానికి కొంత ఆట పరికరాలను కూడా తెచ్చుకోవచ్చు. గేలం వేయడం, చేపలను పట్టడం వంటి కొన్న కార్యకలాపాలు ప్రజలను ఎంతో బిజీగా ఉంచుతాయి. ఫోటోగ్రఫీ పై ఆసక్తి ఉన్న పర్యాటకులు ఈ ప్రాంతంలోని దృశ్యాల చక్కటి కొన్ని ఫోటోలను పొందవచ్చు.



Click it and Unblock the Notifications