Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » రోయింగ్ » ఆకర్షణలు » మెహవో వన్యప్రాణి అభయారణ్యం

మెహవో వన్యప్రాణి అభయారణ్యం, రోయింగ్

2

దట్టమైన పచ్చదనం, విస్తారమైన పర్వత శ్రేణుల మధ్య ఉన్న మెహవో వన్యప్రాణి అభయారణ్యం సందర్శకులకు కనువిందును కల్గిస్తుంది, అదేవిధంగా శాస్త్రవేత్తలు, జీవశాస్త్రజ్ఞులు, వృక్ష శాస్త్రజ్ఞులకు ఒకే రకంగా ఎంతో ఉపయోగకరమైన పరిశోధక కేంద్రంగా నిరూపించుకొంటుంది. ఈ ప్రదేశంలో వృక్ష, జంతు సంపదతో బాటుగా సరస్సులు కూడా ఉన్నాయి. ఈ అభయారణ్యంలో అడవిలోని నాలుగు ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఉష్ణమండల సతతహరితారణ్యాలు, ఉప- ఉష్ణమండల సతతహరితారణ్యాలు, సమశీతోష్ణ మండల అడవులు, సమశీతోష్ణ వెడల్పు ఆకుల అడవులు, సమశీతోష్ణ సూదిమొన అడవులు. ఈ అడవులలో ఆసక్తికరమైన వృక్ష శ్రేణి ఉంటుంది.

ఇది విభిన్న జాతుల పక్షులు, జంతువులు, కీటకాలకు ఆశ్రయాన్నిస్తూ, మెహవో వన్యప్రాణి అభయారణ్యాన్ని ఒక అందమైన పర్యాటక ఆకర్షణగా మారుస్తుంది.

ఈ అభయారణ్యంలో నివాసముంటున్న కొన్ని ముఖ్యమైన క్షీరదా జాతులు – పులి, చిరుత పులి, మబ్బుల చిరుతపులి, ఫిషింగ్ క్యాట్, అడవి పిల్లి, మచ్చల లింసాంగ్, అడవి కుక్క, పసుపు ఉదరం వీసిల్, బర్మా ఫెర్రేట్ బాడ్జెర్, సాధారణ ముంగిస, మలే త్రీష్రు, సాంబార్, మొరిగే జింక, భారతీయ ఏనుగు, అస్సామీ మెకాక్, స్లో లోరిస్, హిమాలయ నల్ల ఎలుగుబంటి, భారత పందికొక్కు, ఎర్ర పాండా, కస్తూరి జింక, మంచు చిరుత, గోరల్ ఇంకా ఎన్నో.

మెహవో వన్యప్రాణి అభయారణ్యంలో కనబడే పక్షులలో గూసందర్, పెద్ద నీటికాకి, కాటన్ టేల్ హిమాలయల అనేకరంగుల కింగ్ఫిషర్, బ్లూ కంఠం బార్బెట్, జపనీస్ ఆఫించ్, ఎరుపు తల ఉన్న లాఫింగ్ ట్రస్ట్, గ్రేట్ పైడ్ హార్న్ బిల్, నలుపు గిజిగాడు, నీలి పిట్టా, పెద్ద రాకెట్ వంటి తోక గల డ్రోంగో, చిన్న తోక ఉన్నమచ్చల ర్యాన్ బాబ్లార్, గ్రీన్ మాగ్పై వంటివి అనేకం ఉన్నాయి.

ఈ అభయారణ్యంలో విభిన్న రకాల విషపూరిత, విషరహితమైన నల్ల కట్లపాము, పట్టికల కట్లపాము, నాజా నాజా నాగుపాము, కింగ్ కోబ్రా, పిట్ వైపర్, కొండచిలువ, విప్ స్నేక్, భారతదేశపు సాధారణ నలుపు పాము, హిమాలయ క్యాట్ స్నేక్, గ్రీన్ విప్ స్నేక్ వంటి పాములను చూడవచ్చు.

పైన జాబితాలో తెల్పిన జాతులే కాక, మెహవో వన్యప్రాణి అభయారణ్యంలో చేపలు, సీతాకోకచిలుకలు కూడా సమృద్ధిగా ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue