హిమాలయాల దిగువ శ్రేణి లో కల సత్తాల్ ఒక పర్యాటక ఆకర్షణ. ఇది సముద్ర మట్టానికి 1370 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశంలో పర్యాటకులు ఏడు అందమైన సరస్సులను ఒక దానితో మరి ఒకటి అనుసంధానించబడి వుండటం చూడవచ్చు. ఈ ఏడు సరస్సుల పేర్లు గరుడ తాల్, పూర్ణ తాల్, సీతా తల, రాం తాల్, లక్ష్మణ్ తాల్, నల దమయంతి తాల్ మరియు చివరిడిగా సుఖ తాల్ అని చెపుతారు. సాత్తల్ ప్రదేశం మెహ్రా గావ్ వాలీ లో కలదు. దీని చుట్టూ ఓక్ చెట్ల అడవులు కలవు. బ్రిటిష్ కాలం లో ఇక్కడ తేయాకు తోటలు ఉండేవి.
ఈ ప్రదేశం లో అనేక సరస్సులు మాత్రమేకాక సరస్సులలో కల నీటి లో పుష్కలంగా పోషకాలు కరిగి వుంటాయి. ఈ ప్రదేశం వివిధ వృక్ష, జంతు జాలాలకు నిలయం గా వుంది. పర్యాటకులు ఇక్కడ కనీసం 500 రకాల వివిధ వలస పక్షులను చూసి ఆనందించవచ్చు. 525 రకాల సీతాకోక చిలుకలు, 20 రకాల జంతువులు, 1100 కీటక జాతులు కూడా కలవు. తరచుగా కనపడే పక్షులు రెడ్ బిల్లెద్ బ్లూ మాగ్ పీస్, కింగ్ ఫిషర్స్, బ్లూ త్రోఅట్ మరియు బ్రౌన్ హెడ్ బర్బేట్ లు, ఇండియన్ త్రీ పీస్, బ్లూ విజిలింగ్ తృష్, వంటివి వుంటాయి. ఇవే కాక హిమాలయాల లో గడ్డ కట్టే చలి లో నివసించే కొన్ని పక్షి జాతులను కూడా చూడవచ్చు.
నా నాటికి కనుమరుగవుతున్న కీటకాలు, జంతు , వృక్ష జాలాలు , అనేక వన మూలికల ఔషద చెట్లు కూడా ఇక్కడ కనపడతాయి. సత్తాల్ లో కల సత్తాల్ మిషన్ ఎస్టేట్ మరియు మెథడిస్ట్ ఆశ్రం, బట్టర్ ఫ్లై మ్యూజియం మరియు సుభాష్ ధారా లు ప్రాత్యేక ఆకర్షణలు.
సత్తాల్ ప్రదేశం సాహసికులకు ఒక స్వర్గం. ఇక్కడ ట్రెక్కింగ్, క్యాంపు లు, బోటింగ్, మరియు మౌంటెన్ బైకింగ్ వంటివి చేయవచ్చు. రాఫ్టింగ్, రాక్ క్లైమ్బింగ్ లు కూడా కలవు.
సత్తల్ కు సమీప విమానాశ్రయం పంత్ నగర్ ఎయిర్ పోర్ట్. సమీప రైల్ స్టేషన్ కాథ్ గోదాం. సమీప నగరాలనుండి బస్సులు కలవు. ఈ ప్రదేశ పర్యటనకు మార్చ్ నుండి జూన్ వరకు మరియు సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు అనుకూలమైన వాతావరణంగా చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications