శ్రీ మహావీర్ జి దేవాలయం రాజస్తాన్ లోని పవిత్ర జైన తీర్థ యాత్ర స్థలాలలో ఒకటి. ఇది గంభీర్ నది ఒడ్డున సవాయి మాధో పూర్ లోని ఒక చిన్న గ్రామమైన చంద్రపూర్ లో ఉంది. పద్మాసన ముద్రలో గల మహావీర దేవుని ఇసుక రాతి విగ్రహం ఈ ప్రాంతపు ప్రధాన ఆకర్షణ.
పుష్ప దంతుడు, శాంతినాధుడు, ఆదినాదుల విగ్రహాలు ఇక్కడి ఇతర విగ్రహాలు.మార్చ్, ఏప్రిల్ నెలలో సంవత్సరపు ఉత్సవం జరిగే సమయం ఈ దేవాలయం సందర్శనకు ఉత్తమమైనది. ఈ పండుగ ఉత్సవాలలో పవిత్ర మహావీర దేవుని విగ్రహాన్ని గంభీర్ నదీ పవిత్ర జలాలలో నిమజ్జనం చేయడం ముఖ్య విషయం. ఆ సమయంలో తీర్థంకరుల ఆశీస్సుల కోసం దేశం లోని అన్ని ప్రాంతాల నుండి జైన తీర్థ యాత్రికులు ఈ దేవాలయానికి వస్తారు.



Click it and Unblock the Notifications