రాజస్థాన్ లోని షేఖావతి ప్రాంతం లో వున్న బగర్ అనే పట్టణం ఇక్కడి చిత్రించిన ప్రాసాదాలకు ప్రసిద్ది. ఇందులో అధిక భాగం భవనాలను 20వ శతాబ్దం లో షేఖావతి లోని మార్వాడి వ్యాపారులు నిర్మించారు. వీటిలో కొన్ని ప్రాసాదాలను కొన్ని చోట్ల స్వచ్చమైన బంగారం తో చిత్రించారు కూడా.ఇప్పుడు వారసత్వ హోటళ్ళు గా మార్చ బడ్డ రూన్గ్తా లు, పిరమాల్ మఖారియా ల భవనాలు ఈ పట్టణం లోని ప్రధాన ఆకర్షణలు. ఫతే సాగర్ చెరువు, మియా సాహెబ్ దర్గా, శ్వేత ద్వారం బగర్ పట్టణం లోని ఇతర ఆకర్షణలు.



Click it and Unblock the Notifications