అక్బర్ పాలన నుండి కలోనియల్ రూల్ వరకు భారత దేశం లో వేటకు ఉపయోగించబడిన ప్రముఖ ప్రాంతం గా ఈ మాధవ్ నేషనల్ పార్క్ అనే అటవీ ప్రాంతం గురించి చరిత్ర పుటల్లో తెలుస్తోంది. ఒక ఏనుగుల మందనే అక్బర్ స్వాధీనం చేసుకున్నాడని ఒక పుకారు ఉంది.
354 చదరపు అడుగుల మేరకు విస్తరించి, ఏటవాలు కొండలపై, చదునైన పచ్చిక నేలపై చుట్టూ సరస్సుతో ఉన్న ఈ మాధవ్ నేషనల్ పార్క్ వన్య మృగ జీవన విధానం గురించి తెలుసుకోవాలనుకునేవారికి అద్భుతమైన అవకాశం. మానవుని చేత కలుషితం కానటువంటి ప్రకృతి సౌందర్యం తో పాటు జీవ వైవిధ్యానికి పెద్ద పీట వేసిన ఈ ప్రాంతం చక్కని ప్రదేశం.
సిండియా రాజు జీవాజీ రావు సిండియా చేత నిర్మించబడిన జార్జ్ కేసిల్ అనేది పర్యాటకులకు కనువిందు కలిగించే అద్భుతమైన కట్టడం. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి ఈ కలోనియల్ నిర్మాణం ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఈ కోటలో నుండి సూర్యాస్తమయ దృశ్యం అనిర్వచనీయం. ఇక్కడ సరస్సులో నివసిస్తున్న మొసళ్ళను దగ్గర నుండి చూడడానికి సఖ్య సాగర్ బోటు క్లబ్ పర్యాటకులకి చక్కటి అవకాశం కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications